జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ)తో రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదన్నారు... ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుందని జగన్ విమర్శించారు... మీ కమిటీ పరిశోధన... కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా ఉంది. ఎంతిచ్చారు.. ఎంత తీసుకున్నారన్న విషయం పక్కనబెట్టి ప్రత్యేక హోదా పై పోరాడాలని అన్నారు...
అంతే కాదు, చంద్రబాబు పై కూడా "ఆడు" అంటూ సంబోధిస్తూ, "ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పని చేయకుండా డ్రామా ఆర్టిస్టుగా మారాడు. గత 15 రోజులుగా ఎడతెగని డ్రామాను నడిపిస్తున్నాడు" అంటూ చంద్రబాబు పై అమర్యాదగా మాట్లాడారు జగన్... హోదా కోసం రాజీనామా చేయండయ్యా అంటే.. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అన్నాడు, అంటూ జగన్ నోటికి ఇష్టం వచ్చిన మాటలు బహిరంగ సభలో మాట్లడారు...
అయినా, మోడీని చుస్తే ఫ్యాంట్ తడుపుకునే జగన్, ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పటి వరకు కేంద్రం పై చేసిన పోరాటం ఏంటి ? అసలు ఇప్పటి దాకా, మోడీని ఒక్క మాట అనే సాహసం చేసాడా ? ఇన్నాళ్ళు మిత్ర పక్షం టిడిపి పోరాడుతుంటే, ప్రధానిని చూడగానే ఈయన ఎంపీలు పారిపోయేవారు... ఇక విజయసాయి రెడ్డి గురించి అయితే, ఎంత తక్కువ చెప్తే అంత మంచిది.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, హోదా ఇస్తేనే మీకు మద్దతు అని జగన్ ఎందుకు అనలేదు ? ఇలాంటి జగన్, ఇప్పుడు పవన్ మీద, చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు... అయినా పవన్ మీదా ? చంద్రబాబు మీదా విమర్శలు చేస్తే ఏమొస్తుంది.... ఒక్కసారి మోడీ మీద విమర్శలు చేసి చూడు జగన్..