విశాఖ గ్యాస్ లీక్ మటన పై వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రెస్ మీట్ లో, స్పందించిన ఒక విషయం పై దుమారం రేగింది. అంతకు ముందు ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఘటన పట్ల ఆవేదనను వ్యక్తం చేసారు. గురువారం తెల్లవారుజాము సమయంలో విశాఖ ఎల్‌జీ పాలిమర్స్, రసాయన వాయువు లీకేజీ ఘటన గురించి విశాఖలో ఘటనా స్థలానికి దగ్గరగా వున్న గ్రామాలతో పాటుగా, గ్యాస్ లీకేజీ ప్రభావానికి గురైన వారందరిని ఆస్పత్రులకు తరిస్తున్నామని, ప్రతి ఇంటింటి వెళ్ళి బాధితులెవ్వరైనా ఉన్నారా అని వరిశీలించి, అవసరమై సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి కన్నబాబు విశాఖలోనే మకాం చేసి అన్ని సహయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేసారు.

అయితే ఈ సమయంలో, జగన్ మాట్లాడుతూ, ‘‘ఎల్ జి పాలిమర్స్ మల్టీ నేషనల్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ కోటి పరిహారం అందించేలా చూస్తా. ఎల్ జి సంస్థ ఏ మేరకు పరిహారం ఇస్తుందో చూస్తాం. ఆ పై సాయం ప్రభుత్వం నుంచే అందిస్తాం. చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఎల్ జి కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా. సంస్థను తిరిగి ప్రారంభించాక అక్కడే ఉన్నా,వేరే చోటకు తరలించినా బాధిత కుటుంబాలకు ఉపాధి చూపిస్తామని’’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యాల పై అటు సోషల్ మీడియాలో, ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడుతూ, "ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చాలా క్యాజువల్ గా మాట్లాడారు. ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని మహాత్మాగాంధీ చెప్పారు."

"ఇందులో కూడా బాధితులను దృష్టిలోపెట్టుకుని మాట్లాడాలే తప్ప పరిశ్రమ యాజమాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడరాదు. దీనిని ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. తేలిగ్గా ఏదేదో చెప్పేసి 278, 284,285,337,338(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తే చాలదు. సింపుల్ కేసులు పెట్టి నార్మల్ గా ఈ కేసును పరిగణించడం కరెక్ట్ కాదు. అంతకు ముందు కూడా కరోనాపై ఇలాగే ‘‘అదేదో చిన్న జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని, బ్లీచింగ్ జల్లాలని’’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇప్పుడు ఇంత తీవ్ర ప్రమాదాన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని దుష్ప్రభావం సుదీర్ఘకాలంలో తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, మీడియాలో కథనాలు వస్తున్నాయి,వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకోవాలి." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read