జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ నుంచి పెద్దల సభకు పంపే నలు గురు పేర్ల ఖరారు చేసారు. ఊహించని విధంగా తన క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులను పెద్దల సభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా తగ్గించి, బీసీలకు అన్యాయం చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తోన్న సమయంలో జగన్ తప్పక ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో స్థానం, పారిశ్రామికవేత్త, రాంకీ సంస్థల అధినేత, అయోధ్య రామిరెడ్డికి ఇచ్చారు. ఇక అనూహ్యంగా, రాష్ట్రం బయట వ్యక్తికి, మన రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తికి, కేవలం బీజేపీ ఒత్తిడితో ఈ నాలుగో సీటు ఇచ్చారు. అమిత్ షా ఆదేశించటం, స్వయంగా ముఖేష్ అంబానీ వచ్చి నత్వానికి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్థించడంతో ఆయనకు జగన్ ఓకే చెప్పారు. ఈ నాలుగు పేర్లను ఆ రోజు అధికారికంగా ప్రకటించారు. జగన్ క్యాబినెట్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాస్ చంద్రబోస్ తోపాటుగా మరో మంత్రి మోపిదేవి వెంకటరమణను పెద్దల సభకు పంపాలని జగన్ నిర్ణయించుకున్నారు. వారిద్దరితోనూ రాత్రి పొద్దుపోయిన తర్వాత చర్చించారు.
ముందుగా మోపిదేవి అందుకు పూర్తిగా అంగీకారం తెలపకపోయినా జగన్ చెప్పడంతో చివరకు అంగీకరించారు. వైఎస్సార్ మరణం నాటి నుంచి పిల్లి సుభాస్ చంద్రబోస్ పూర్తిగా జగన్ తోనే నిలిచారు. ఆయనకు జగన్ 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా, మండపేట నుంచి పోటీ చేసే అవకాశం కల్పిం చినప్పటికీ ఓటమి చెందారు. అయితే అప్పటికే ఎమ్మె ల్సీగా ఉండటంతో జగన్ తన క్యాబినెట్ లో బీసీ కోటాలో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి కట్ట బెట్టారు. గోదావరి జిల్లాలో ప్రభావం చూపే శెట్టి బలిజ వర్గానికి చెందిన బోస్ కు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి మరింతగా దగ్గర య్యేందుకు జగన్ వ్యూహాత్మంగా నిర్ణయం తీసుకు న్నారు. ఇక మోపిదేవి గతంలో వైఎస్సార్ హయాం లో మంత్రిగా పనిచేశారు. ఆయన వాన్ పిక్ వ్యవహా రంలో సీబీఐ విచారణ ఎదుర్కొని జగతోపాటు జైలుశిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దు నిర్ణయంతో వారిద్దర్నీ రాజ్యసభకు ఖరారు చేస్తూ జగన్ నిర్ణయించారు.
తన వ్యాపార భాగస్వామిగా ఉంటూ తొలి నుంచీ రాజకీయంగా తనతో ఉన్న ఆయోధ్యరామిరెడ్డికి సైతం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు. 2014లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వలేదు. అదే కుటుంబానికి చెందిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి ఎంపీగా సీటు ఇవ్వడం, అదేవిధంగా అయోధ్యరామిరెడ్డి సోద రుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి నుంచి గెలిస్తే క్యాబినెట్లో స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఐతే సామాజిక సమీకరణాలతో చివరి నిమిషంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించారు. స్వయంగా ఆంబానీ వచ్చిన పరిమళ్ నత్వా నికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరడంతో జగన్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో 3 స్థానాలు వైసీపీకి, ఒకటి స్వతంత్ర అభ్యర్థిగా నత్వానిని ఎపీ నుంచి పెద్దల సభకు పంపనున్నారు. ఇక రాజ్యసభ సీటు పై ఆశలు పెట్టుకున్న వైవీ సుబ్బారెడ్డి, బీదమస్తాన్‌రావు, మేకపాటి రాజ మోహన్ రెడ్డి, పండుల రవీంద్రబాబు వంటివారిని బుజ్జగిస్తున్నారు.