గిల్లితే గెల్లించుకోవాలి.. అంతే కాని అరవకూడదు... ఇది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ తీరు. ఎవడైనా సరే ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల బాధపడితే, బాధను భరిస్తూ ఇంట్లో కూర్చుని ఏడవాలి కానీ, ఏదో జరిగిపోయింది, నాకు న్యాయం చేయండి అని రోడ్డు ఎక్కితే, తొక్క తీస్తాం అనే వార్నింగ్ లు గతంలో ఎన్నో వచ్చాయి, ఎన్నో సంఘటనలు చూసాం, చివరకు ప్రాణం పోయిన సంఘటనలు కూడా చూసాం. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటన మళ్ళీ మన కళ్ళ ముందుకు వచ్చింది. నాలుగు రోజులు క్రితం ఒంగోలులో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. జగన్ కాన్వాయ్ లో కారు కావాలని, తిరుపతి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసి, కారు ఎత్తుకుపోయిన ఘటన చూసాం. అర్ధరాత్రి నడి రోడ్డు పైన, ఆడవాళ్ళని పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతికిన ఆ వ్యక్తి, తన ఆవేదన మీడియాతో చెప్పుకున్నారు. అక్కడ నుంచి వేరే కారు మాట్లాడుకుని, తిరుమల వెళ్లి, మొక్కులు తీర్చుకుని తిరిగి వచ్చారు. ఈ ఘటనతో వైసీపీ ప్రభుత్వం ఎలాంటిదో మరో సారి రుజువైంది. ప్రతిపక్షాలు, మీడియా ఈ విషయం పై గోల గోల చేయటంతో, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి ఆగ్రహం కొంత మంది సిబ్బంది సస్పెన్షన్ అంటూ, రొటీన్ వార్తలు వచ్చాయి. అయితే విషయం ఇక్కడితో అయిపోలేదు.

ongoloe 240420222

తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారనే కక్షతో, ఆ కుటుంబం పై వేధింపులు మొదలు పెట్టారు. తమని వదిలేయాలని ఆ కుటుంబం వేడుకునే పరిస్థితికి వచ్చింది. తమ కారు లాక్కుని, తమను రోడ్డున పడేసరనే బాధ చెప్పామే కానీ, తమకు ఎవరి పైన కోపం లేదని, తాము తిరుమల నుంచి తిరిగి వచ్చిన తరువాత, ఎస్పీ ఆఫీస్ నుంచి, ఆర్టీవో ఆఫీస్ నుంచి విచారణ పేరుతో వేధిస్తున్నారని, తాము అసలు ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, తమ బాధలు ఏవో తామే పడుతున్నాం అని, అర్ధం చేసుకోవాలని బాధితుడు వాపోతున్నారు. బాధితుడి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి, రోదిస్తున్నారు. తమది చిన్న కుటుంబం అని, చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నాం అని, తమను వదిలేయాలని, తమ పిల్లలు పడిన బాధను అర్ధం చేసుకోవాలని రోదిస్తూ, తామకు ఈ వేధింపులు ఏంటి అంటూ, ఆమె మీడియా ముందు బాధ పడుతున్నారు. జరిగిన అన్యాయాన్ని చెప్పటం కూడా తప్పేనా, ఎందుకు తమను ఇలా భయాందోళనకు గురి చేస్తున్నారు అంటూ, ఆమె వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read