ఎన్నికల తర్వాత జగన్ ఎన్డీయేలోకి వస్తారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ చెబుతున్న జాబితాలోని అత్యధికులు ఎన్డీయేలోకి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చాలా సర్జికల్ స్రైక్స్ జరిగాయని, ఎప్పుడైనా చెప్పుకున్నామా అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు దత్తాత్రేయ కౌంటర్ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కేసీఆర్‌ ఒక్క కేబినెట్‌ భేటీకి కూడా వెళ్లలేదని, కేసీఆర్‌కు సర్జికల్‌ దాడుల గురించి ఏం తెలుసని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ‘టీఆర్‌ఎస్‌, వైసీపీ మాకు మిత్రులే’... అని కేంద్ర మంత్రి, ప్రధానికి అత్యంత విశ్వాసపాత్రుడైన పీయూష్‌ గోయెల్‌ కూడా వారం క్రితం చెప్పిన సంగతి తెలిసిందే.

dattatraya 01042019

ఈ ప్రకటనలు వైసీపీని ఇరుకున పడేసింది. మోదీని వైసీపీ ఎక్కడా విమర్శించడంలేదు. బీజేపీతో తమ బంధాన్ని గోప్యంగా ఉంచుతోంది. దానిపై బహిరంగంగా మాట్లాడటంలేదు. ఇప్పుడు వారి మధ్య మైత్రిని పీయూష్‌, దత్తాత్రేయ బయట పెట్టేశారు. బీజేపీతో బహిరంగ స్నేహం క్రైస్తవులు, ముస్లింలో ఆగ్రహం తెప్పిస్తుందని, వారి ఓట్లు దూరమవుతాయనే ఆందోళనతోనే జగన్‌ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పీయూష్‌, దత్తాత్రేయ ఈ బంధాన్ని బయట పెట్టేశారని రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వినవస్తున్నాయి. పీయూష్‌, దత్తాత్రేయ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో కొంత గుబులు కనిపిస్తోంది. బీజేపీకి మిత్రపక్షంగా మైనారిటీల్లో వ్యతిరేకత ఏర్పడుతుందేమోనన్న అనుమానం వారిని తొలుస్తోంది. ఈ వ్యాఖ్యలను అందిపుచ్చుకొని టీడీపీ నాయకత్వం దానిని ప్రచారంలో పెడితే దానికి ఎలా సమాధానం ఇవ్వాలన్న దానిపై వారు తర్జనభర్జన పడుతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది!

dattatraya 01042019

పోలవరం ప్రాజెక్టుపై మొదట్నుంచీ టీఆర్‌ఎస్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ‘మన మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు చంద్రబాబు’ అని కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. మొన్నటికి మొన్న పోలవరంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు రాయలసీమకు కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టులనూ మూసేయాలన్నట్లుగా ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్నారు. ‘పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులపై కేసీఆర్‌ వైఖరి మాటేమిటి? దాని గురించి కూడా జగన్‌ మాట్లాడితే బాగుండేది’ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్‌ వ్యాఖ్యలు అసహనంతో, కేవలం ఎదురుదాడి కోసం చేసినట్లుగా ఉన్నాయని... కీలక సమయంలో సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లయిందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read