అమరావతి... ఇది ఒక స్వప్నం. 2014 దాకా, మనది అనుకున్న హైదరాబాద్, మనం నిర్మించుకున్న హైదరాబాద్ ను కాదని, మన బ్రతుకు ఏదో మనం బ్రతుకుదాం. మన కష్టం మనమే పడదాం. మరో హైదరాబాద్ ని మన తెలివితేటలతో , కష్టంతో నిర్మించుకుందాం అని అనుకున్నాం. అనుకున్నట్టే, మంచి విజన్, అనుభవం ఉన్న చంద్రబాబుని ఎన్నుకున్నాం. ఆయన అన్నీ అలోచించి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయం తీసుకున్నారు. రివర్ ఫ్రంట్ క్యాపిటల్ కావటంతో, నీరుకు ఇబ్బంది ఉండదు. అన్ని ప్రాంతాలకు బస్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ ఉంటుందని, జనాభా కాని, భౌగోళికంగా కానీ, అన్ని విధాలుగా అమరావతి రాష్ట్రంలో అందరికీ సమాన దూరంలో ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి అమరావతి పై ఏడుపులు మొదలయ్యాయి. భ్రమరావతి అని ఒకరు అంటే, ఎవరు రాజధాని అమరావతి అని మరొకరు, ఇలా అన్ని పార్టీలు అమరావతి మీద ఏడుపులు మొదలు పెట్టాయి.

చివరకు కులం కూడా తీసుకువచ్చారు. 2018 వరకు నిర్మాణాలు మొదలు కాకుండా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు కూడా వేసారు. అయితే 2018 నుంచి 2019 మధ్యే, దొరికిన ఆ ఒక్క ఏడాదిలోనే అనేక నిర్మాణాలు పూర్తి చేసారు చంద్రబాబు. హైకోర్టు నిర్మాణం పూర్తయ్యింది. ఐఏఎస్ క్వార్టర్స్ , ఐపిఎస్ క్వార్టర్స్ , జడ్జీలు క్వార్టర్స్ , ఎన్జీవోల క్వార్టర్స్, ఇలా అనేక నిర్మాణాలు చేసారు. కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం చేసారు. సీడ్ ఆక్సెస్ రోడ్ నిర్మాణం జరిగింది. అంతర్గత రోడ్డుల నిర్మాణం జరిగింది. రైతులకు ఇచ్చే ప్లాట్లు అభివృద్ధి పనులు జరిగాయి. ఇక 5 టవర్ల శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం కూడా మొదలయ్యింది. మరో పక్క, అక్కడ నివాసం ఉండే వారి కోసం, ప్రభుత్వమే హ్యాపీ నెస్ట్ అనే ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. హాట్ కేకులులా ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. ఇలా మొత్తం, ఈ నిర్మాణాల పై రూ.10 వేల కోట్లు ఖర్చు చేసారు. ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చెయ్యటంతో, రూ10 వేల కోట్లతో చేసిన ఈ నిర్మాణాలు అన్నీ, బూడిదలో పోసిన పన్నీరు అవ్వనున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read