రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్ళాల్సిన, జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దు అయ్యింది. కొద్ది సేపటి క్రిందట దీనికి సంబంధించిన సమాచారం మీడియాలో వస్తుంది. ఈ రోజు ఉదయం జగన్ కు కాలు బెణకటంతో, కాలుకి గాయం అయ్యింది. అయితే ఈ రోజు సాయంత్రానికి ఆ గాయం తీవ్రం అవ్వటంతో, డాక్టర్లు మరింత రెస్ట్ అవసరం అని చెప్పటంతో, రేపటి ఢిల్లీ టూర్ రద్దు అయినట్టు తెలుస్తుంది. ఎల్లుండి కేంద్ర హోం శాఖ అధ్వర్యంలో, నిర్వహించే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సియంల సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ సమావేశానికి కేసిఆర్ వస్తున్నారు. దాదపుగా ఏది తరువాత కేసిఆర్, జగన్ ఒకే వేదిక పైన ఉంటారని అందరూ భావించారు. జల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయని అనుకున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ ఢిల్లీ టూర్ రద్దు అయ్యింది.  జగన్ కు బదులుగా, ఈ సమావేశానికి హోం మంత్రి సుచరిత వెళ్లనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read