కట్టడం చేతకాని వారు ఏం చేస్తారు? కూలగొడతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంసం, అమరావతి నాశనానికి కంకణం కట్టుకోవడంతో పతాకస్థాయికి చేరింది. మూడు రాజధానుల పేరుతో విశాఖని ధ్వంసం చేస్తున్నారు. కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు పెడుతున్నా రుషికొండకి గుండు కొట్టడం ఆపలేదు. సెల్ఫ్ ఫైనాన్ష్ ప్రాజెక్టు అయిన అమరావతిని పూర్తి చేయడానికి లక్ష కోట్లు కావాలని సాకు చూపెడుతూ, మరోవైపు రాజధానిలో విధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిలో టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లని నేటికీ లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం అప్పగించలేదు. ఇప్పుడు రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నిమిత్తం 1134ఎకరాల భూమిని బదలాయించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, రాజధాని ప్రాంతంలో నోటిఫై చేసిన ఆర్-5 కొత్త జోన్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించడం అమరావతిలో మరో విద్వేష విధ్వంస కుతంత్రమేదో పన్నినట్టు తెలుస్తోంది. గుంటూరు-కృష్ణా జిల్లాల మొత్తం రెవెన్యూ యంత్రాంగమంతా ఈ పట్టాల పంపిణీ పూర్తి చేసేవరకూ వేరే పనులు ముట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయని ప్రచారం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు అప్పగించకుండా, రాజధాని ఇతర ప్రాంతాల పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైకాపా అనుకూల మీడియా కథనాల ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతతో ఇక్కడి సీట్లు ఓడిపోవడం ఖాయమని, ఇతర ప్రాంతాల నుంచి తమకు సాలిడ్ ఓటింగ్ వర్గాలని ఇక్కడకి తరలించేందుకు ఈ సెంటు స్థలం నాటకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ సామెతను జగన్ నిజం చేస్తున్నాడా ? అమరావతే సాక్ష్యం..
Advertisements