అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, యథావిధిగా అమరావతిలో అభివృద్ధి పనులు తదితరంశాలే కీలకంగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి శాసనసభా సమావేశాలు జరుగను న్నాయి. ఈ సమావేశాల్లో అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరా ల్సిందేనని వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ ఎమ్మల్యేలకు, మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి వ్యుహత్మక మార్గదర్శకాలను ఆయన పార్టీ ఎమ్మల్యేలకు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఉదయం సైతం ముఖ్యమంత్రి కీలకనేతలతో సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో ఆయన పలు అంశాలపై చర్చించి, పలు సూచనలు చేసారు. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ బిల్లును సమావేశం ప్రారంభమై, సభా సంప్రదాయక అంశాలు ముగిసిన వెంటనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్, వురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బోత్సా సత్య నారాయణలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. అంతకు ముందు ఈ బిల్లు, ఇతరంశాలపై బీఎసిలోను ప్రస్తావిస్తారు. నిజానికి సమావేశంలో ఆర్థిక బిల్లుగా సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టే అంశాల గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శాసనసభా వ్యవహరాల మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న మంత్రి బుగ్గన, చీప్ శ్రీకాంతరెడ్డితో ఇప్పటికే క్షుణంగా, సుదీర్ఘంగా చర్చించారు.
ఈ చర్చల్లో భాగంగా సీఆర్డీఎ చట్టం రద్దును ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే! వికేంద్రీ కరణ బిల్లుకు సంబంధించి హైపవర్ కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సిఎంకు సమర్పించింది. ఈ కమిటీ పూర్తి నివేదికను ఆదివారం రాత్రిలోపు, లేదా మంత్రి వర్గ సమావేశానికి కొద్దిగంటల ముందు ముఖ్యమంత్రికి సమర్పిస్తుంది. నివేదికలోని అంశాలు ఇతర సూచనలు సాంకేతిక, చట్టపరమైన దిశలో రూపొందించి ప్రభు త్వానికి హైపవర్ కమిటీ అందజేసింది. ఈ నివేదికకు అనుగుణంగా ఉదయం తొమ్మిదిగంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేయడం, ఆ వెంటనే గవర్నరు అనుమతిని తీసుకోవడం, 11 గంటలకు ఆరంభమయ్యే శాసనసభా సమావేశంలో బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగిపోతుంది. శాసన మండలిలోను బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింవచేసేందుకు వీలుగా వ్యుహన్ని ప్రభుత్వం సిద్ధం చేసిందంటున్నారు. శాసనమండలి 21న ఆరంభమవుతుంది. శాసనసభా సమావే శాలు మూడు రోజులు జరిగితే, మండలి సమావేశం ఒక్క రోజు మాత్రమే జరిగే అవకాశం ఉంది.
అందువలన 21న ఉభయ సభల ఉమ్మడి సమావేశం నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తు కాగా శాసనసభ ప్రత్యేక సమావేశాల ఆరంభమగుతున్న సందర్భంలో ప్రతిపక్షం తెలుగుదేశం కీలక వ్యుహన్ని చేయనున్నదంటున్నారు. ఇప్పటికే టిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించి, ఆ పార్టీ ఎంఎలకు విప్ జారీ చేసింది. అదే సందర్భంలో అసెంబ్లీ ముట్టడికి విపక్షనేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వీటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కోనే దిశలో సిఎం జగన్ ఎంఎలకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు రేంజీ ఐజి విని లాల్ ప్రకటించారు. ఆ ప్రాంత గ్రామాల రైతులకు అసెంబ్లీ సమా వేశాలకు ఆటంక కలిగిస్తే చర్యలుంటాయని పోలీసులు నోటీసులు జారీ చేసారు. ఇదే సందర్భంలో టిడిపి కుడా సీఆర్టీఏ, అమరావతి అంశాలపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ బిల్లు ప్రవేశాన్ని తీవ్రంగా అడ్డు కోవాలని జగన్ ఎమ్మల్యేలకు ఆదేశించారు. ఇక జగన్ అసెంబ్లీకి వచ్చే దారుల్లో పోలీసులు మూడం చెల పోలీసు భద్రతను, విస్తారంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో జెఎసి నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు.