మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సీఐడీ నమోదుచేసినకేసు రాజకీయకక్షసాధింపని, మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్ తో తేలిపోయిందని, ప్రభుత్వం, వైసీపీనేతలు తప్పుడుకేసులుపెడుతుంటే, వాటిలో కనీసం ప్రాథమిక ఆధారాలుకూడా లేనిపరిస్థితిలో చంద్రబాబునాయుడు కోర్టునుఆశ్రయిస్తే, అక్కడ స్టే ఇవ్వడం జరిగిందని, దాన్నికూడా తప్పుపడుతూ, అధికారపార్టీనేతలు మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్ర హం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేసులో ప్రాథమిక ఆధారాలులేకపోతే, అవిరాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టేవి అయినప్పుడు, వాటిని అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయించడం తప్పెలా అవుతుందో వైసీపీనేతలు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. 9ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టులో అక్రమఆస్తులు, అవినీతి కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంటే, ఆనాడు ఆయన స్టేకోసం సుప్రీంకోర్టువరకువెళ్లిన విషయం వైసీపీ నేతలు మరిచారా అని మాజీమంత్రి నిలదీశారు. హైకోర్టు లో, సుప్రీంకోర్టులో స్టే రాకపోవడంతో, జగన్ బొక్కబోర్లా పడ్డాడన్నారు. ఆధారాలున్నాయని కోర్టులుచెప్పడంతో సీబీఐ రూ.43వేలకోట్లదోపిడీ జరిగినట్లు నిర్ధారించింద న్నారు. ఆతరువాత జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైల్లో ఉండివచ్చాడని, ఇప్పుడుకూడా ఆయన బెయిల్ పై నే బయటతిరుగుతున్నాడన్నారు. బెయిల్ పై బయట ఉండి, ముఖ్యమంత్రిహోదాలో కోర్టులకుహజరుకాకుం డా, తనపలుకుబడితో విచారణ జరగకుండా, తనపై ఉన్న అవినీతికేసుల విచారణను ఆయనెలా సాగదీస్తు న్నాడో చూస్తూనేఉన్నామన్నారు. ఆయనపై ఉన్న ఒక్కో కేసులో 10నుంచి 15 మంది ముద్దాయిలు ఉన్నా రని, ఒక్కో మద్దాయి ఒక్కోసారి డిశ్చార్జి పిటిషన్ వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆనందబాబు తెలిపారు. ఒక్కో కోర్టులో ఒక్కో పిటిషన్ వేయడంతో సంవత్సరాల తరబడి నుంచి ఒక్కకేసుకూడా అంగుళంకూడా ముం దుకు కదల్లేదన్నారు. అటువంటి వ్యక్తులు, బెయిల్ పై బయటతిరిగేవారు వారి నిజాయితీని నిరూపించుకోకుం డా, ప్రతిపక్షనాయకుడిపై తప్పుడుకేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు.

జగన్ నిజంగా నిజాయితీపరుడైతే, తనపై కోర్టుల్లో ఉన్నకేసుల విచారణకు హాజరై, వాటి నుంచి త్వరగా బయటపడి, తనసచ్ఛీలతను ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాడని మాజీమంత్రి ప్రశ్నిం చారు. తనపై ఉన్నకేసులవిచారణ త్వరగా జరగాలని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టు లో పిటిషన్ వేయడంలేదన్నారు. జగన్ తండ్రి రాజశేఖ ర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 25వరకు కేసులు చంద్రబాబుపై పెట్టాడని, అనేక కమీషన్లు, కమిటీలు కూడా వేశాడని, చివరకు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో తేలుకుట్టిన దొంగలా మిన్నకుండి పోయాడన్నారు. 2012లో వై.ఎస్.విజయమ్మ కూడా చంద్రబాబుపై తప్పుడుకేసులుపెట్టి, కోర్టులతో చీవాట్లు తిన్నదన్నారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను ఆశ్రయించడం ఏమిటని ఆమెను న్యాయస్థా నం ప్రశ్నిచింది నిజంకాదా అని ఆనందబాబు నిలదీశా రు. ఈ విధంగా అనేకపర్యాయాలు చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ ఆధారాలులేక వీగిపోయాయన్నారు. ఒక విజన్ తో, అభివృద్ధితో, పట్టుదలతో పరిపాలనలో తనదై నమార్క్ చూపడంద్వారా చంద్రబాబునాయుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించాడన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డే మో అవినీతితో ఎలాఆస్తులుపెంచుకోవాలో చేసిచూపి ప్రపంచదృష్టిని ఆకర్షించాడని ఆనందబాబు ఎద్దేవాచేశా రు. జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీవారు చంద్రబాబు గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబుపై గతంలో ఏకేసుల్లోనే స్టేలు లేవని, అవన్నీ కొట్టివేయడం జరిగిందన్నారు. ప్రభు త్వం తాజాగా సీఐడీతో పెట్టించిన కేసుపైనే న్యాయస్థా నం నాలుగువారాలు స్టేఇచ్చిందన్నారు.

సీఐడీని విచార ణజరిపి ఆధారాలు సేకరించాలని కూడా కోర్టుచెప్పింద న్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి తప్పుడు నివే దికలు సృష్టించి, బాధితులనిచెప్పి, వారిని మోసగించి ఎలా తప్పుడుసంతకాలు పెట్టించుకున్నారో మీడియా స్టింగ్ ఆపరేషన్ తో తేటతెల్లమైనా వైసీపీపెద్దల బుద్ధి మారలేదన్నారు. చంద్రబాబుపై ఆరోపణలుచేసిన దొంగలంతా అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. దళితులపై వైసీపీకి ప్రేమ పుట్టుకురావడం విచిత్రంగా ఉందన్న ఆనందబాబు, జీవోనెం-41తో దళితులకు అసైన్డ్ భూములపై సర్వహ క్కులు కల్పించిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిం దన్నారు. చంద్రబాబునాయుడు కల్పించిన హక్కుతో దళితులంతా లబ్ధిపొందారుగానీ, ఎక్కడా ఎవరూ నష్టపోలేదన్నారు. విశాఖపట్నంలో భూసేకరణకు సం బంధించి ప్రభుత్వమిచ్చిన జీవో 72తో అక్కడ 2552 ఎకరాలు ఎలాసేకరించారో, వాటిని ఎవరికి ధారాధత్తంచే శారో, దళితులకుఏవిధంగా అన్యాయం చేశారో ప్రజలకు కనిపిస్తోందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్, క్విడ్ ప్రోకో అనే వి విశాఖపట్నంలోనే జరిగాయితప్ప, అమరావతిలో వాటికి స్థానంలేదని స్వయంగా హైకోర్టే చెప్పడం జరిగిం దనని మాజీమంత్రి స్పష్టంచేశారు. వైసీపీపెద్దలు, ప్రభు త్వంచేస్తున్న తప్పుడు ఆరోపణలు, అబద్ధాలు కోర్టులో వీగిపోవడంతో, దిక్కుతోచనిస్థితిలో పదేపదే అవేఅబద్ధా లతో ప్రజలను నమ్మించాలని వైసీపీవారుచూస్తున్నార న్నారు. చంద్రబాబునాయుడిపై పెట్టిన ఏకేసుల్లోనూ స్టే లు లేవనే వాస్తవాన్ని ప్రభుత్వపెద్దలు గ్రహిస్తే మంచిద న్నారు. ప్రభుత్వ, వైసీపీచర్యలతో వారి సిగ్గేపోతోందని, దళితులకు నిజంగా అన్యాయంజరిగితే, వారే స్వచ్ఛం దంగా బయటికొచ్చేవారన్నారు. టీడీపీహాయాంలో రాజ ధానిప్రాంతంలోని దళితులు ఆర్థికంగా, సామాజికంగా మంచిఉన్నతిని సాధించారన్నారు. కుహనవాద రాజకీ యాలుచేస్తున్న వైసీపీకి ప్రజలే తగినవిధంగా బుద్ధిచెబు తారని ఆనందబాబు అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read