స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, మూడు రాజధానులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయరా దని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం నిశతంగా పరిశీలిస్తోంది. హైకోర్టు నెల రోజులు గడువు ఇచ్చినప్పటికీ వారం రోజుల్లోగా రిజర్వేషన్ల ప్రక్రియను సిద్ధం చేయాలని నిర్ణయించింది. మరోవైపు శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని తిప్పికొట్టే విషయమై అధికార పార్టీ నేతలు, మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ వల్లే 'స్థానిక ఎన్ని కల్లో రిజర్వేషన్లకు విఘాతం కలిగిందనే ప్రచారాన్ని చెయ్యాలని జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే స్థానిక ఎన్నికలు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నందున ఎన్నికలకు అవకాశం ఉండదని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.

హైకోర్టు నెల రోజులు గడువు ప్రకటించిన నేపథ్యంలో ఈ లోగా శాసన సభ బడ్జెట్ సమావేశాలను ముగిస్తే ఎలా ఉంటుందనే విషయమై సీఎం జగన్ సమాలోచనలు జరుపుతున్నారు. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవ ర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రకటనను శాసనమండలిలో మెజారిటీ పక్షంగా ఉన్న తాము వ్యతిరేకిస్తామని మండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేసిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగ పాఠంపై అధికార పార్టీ నేతలు దృష్టి సారించారు. ఈ నెల 6 నుంచే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగి స్తారు. ఇదే అదనుగా టీడీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహరచన చేస్తోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిటీ చెల్లుబాటు కాదని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇవే బిల్లులు గవర్నర్ ప్రసంగంలో పునరావృతమైతే తిరస్కరించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది.

శాసనమండలిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూలేని రీతిన అసలు గవర్నర్ ప్రసంగాన్ని తిరస్కరించడం ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నాలు టీడీపీ ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగంతో పాటు బడ్జెట్ ఆమోదం విషయంలో కూడా వ్యతిరేకంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వమే రూపకల్పన చేస్తుంది. ఇప్పటికే రాజధాని వికేంద్రీకరణ, సీఆ స్టీఏ బిల్లులను గవర్నర్ ప్రసంగంలో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకు నేందుకు ఆర్డినెన్స్ ఏకైక మార్గమని భావిస్తోంది. మండలి జోలికి వెళ్లకుండా ఆర్డినెన్సును జారీ చేసి గవర్నర్ సంతకంతో ప్రక్రియ ప్రారంభించాలనే యోచనతో ఉంది. దీనిపై ఈనెల 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read