రాష్ట్రంలో ఇలాంటి అజ్ఞాలుతో, చంద్రబాబు స్థాయి నాయకుడు పోటీ పడాల్సిన పరిస్థితి... ఇద్దరు ఉన్నారో, ఒకరికి మించిన అజ్ఞానం మరొకరిది... మోడీ అనే పేరు ఎత్తే ధైర్యం లేక, మోడీ చేసే తప్పులకి కూడా చంద్రబాబు మీద పడి ఏడుస్తూ ఉంటారు... ఎందుకంటే మోడీ మీద ఒక్క విమర్శ చేస్తే, అక్కడ అమిత్ రియాక్ట్ అయితే, ఒకడికి కేసులు, ఇంకొకడికి పెన్ డ్రైవ్ లు బయటకు వస్తాయి... అందుకే ప్రతి సందర్భంలో, మోడీని ఒక్క మాట కూడా అనుకుండా, ప్రతి దానికి చంద్రబాబునే నిందిస్తూ ఉంటారు... నిన్న జగన్ విజయవాడలో పర్యటిస్తూ, కనకదుర్గ ఫ్లై ఓవర్ గురించి మాట్లాడారు... నిజంగా, ఇది ఒక పెద్ద సమస్యగా తయారయ్యింది.... కాని, దీనికి బాధ్యలు ఎవరో కూడా తెలిసినా, మోడీని అనే ధైర్యం లేక, చంద్రబాబు మీద పడి ఏడ్చాడు... ఆయన పక్కన ఉన్న వారు చప్పట్లు కొట్టారు... దుర్గగుడి ఫ్లై ఓవర్, ఎవరు కడుతునన్నారో తెలియదు, ఈ అజ్ఞాని సియం అవుతాడు అంట...

flyover 15042018

దుర్గగుడి ఫ్లై ఓవర్, కట్టేది నేషనల్ హైవే మీద... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది.

flyover 15042018

ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334 కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60 కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇది జాతీయ రహదారి కావడంతో దీన్ని కేంద్రం చేపట్టింది. కానీ నిధులు మాత్రం మంజూరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి వంతెనకు రూ.114.60 కోట్ల కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్ల చెల్లింపులు జరిపింది . ఈ పై వంతెన పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ఇంత వరకు రూ.150 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లలు మంజూరు అయ్యాయి. అంటే కేవలం 40 శాతం మాత్రమే కావడం విశేషం. ఇదే సమయంలో రాష్ట్రం తన పరిధికి మించి నిర్మాణం జాప్యం కాకూడదనే ఉద్దేశ్యంతో రూ.170 కోట్ల వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో ప్రతిష్టాత్మ చేపట్టిన కనక దుర్గ పైవంతెన నిర్మాణం తీరు ఇది. కేంద్రం సహకరించకపొతే, ఇది కూడా ఇప్పుడు అప్పుడే అవ్వదు.... నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి, ఇటు రాష్ట్రాన్ని చేసుకోనివ్వరు... కాని జగన్ మాత్రం, మా నాయన 11 కిమీ ఫ్లై ఓవర్ కట్టాను అంటూ, చంద్రబాబుని ఎగతాళి చేస్తున్నాడు... మీ నాయన ఫ్లై ఓవర్ ఒక్కటి కట్టాడేమో, ఆయనకి సైబరాబాద్ అనే సిటీ నిర్మించిన చరిత్ర ఉంది... కేంద్రం నిర్మిస్తే ఇలాగే ఉంటుంది, అందుకే పోలవరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది... ఏమైనా మాట్లాడే ముందు అలోచించి మాట్లాడాలి, దైర్యంగా మాట్లాడాలి... హోదా విషయంలో మోడీని నిలదియ్యలేవు, ఫ్లై ఓవర్ విషయంలో కూడా నిలదియ్యలేవు... నువ్వు సియం అయిపోతావా అన్నాయ్ ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read