జగన్ రెడ్డి మాట తప్పడానికి బ్రాండ్ అంబాసిడర్. జగన్ మోహన్ రెడ్డి మడమ తిప్పడంలో ఆయనకి సరిసాటి ఎవరూ లేరు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నాడు నాలుగేళ్ల తరువాత అవగాహన లేక జగన్ అలా హామీ ఇచ్చారని సజ్జలతో చెప్పించేశారు. మద్యనిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి, తన సొంత కంపెనీల మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. అలాగే తనకి నచ్చనిది ధ్వంసం అయిపోవాలి, తనకి దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే క్రూర మనస్తత్వం ఉన్నందుకే జగన్ ని సైకో అని చంద్రబాబు అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని మర్చిపోయి, ఓటమిని అంగీకరించలేడు. సజావుగా ఎన్నికలు జరపాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా అన్ని మార్గాల్లో ఆయనపై ముప్పేట దాడులు చేసిన మూర్ఖ చరిత్ర జగన్ రెడ్డిది. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారనే అక్కసుతో ఏకంగా శాసనమండలి రద్దుకి బరితెగించిన నియంత మనస్తత్వం జగన్ రెడ్డిది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కూడా జగన్ రగిలిపోతున్నాడు. తననే ఓడిస్తారా అనే పగతో కుతకుతలాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓటమితో సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు. ప్రజా వ్యతిరేకత తీవ్రమై, మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయంతో ముందస్తు ఆలోచన చేస్తున్నారని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. కానీ ముందస్తుకి వెళ్లడం అనేది జగన్ ఇష్టం కాదు, కేంద్రం ఇష్టం. మోడీ, షా ఏది చెప్తే జగన్ అదే చేయాలి. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయి తన జుట్టుని కేంద్రంలోని బీజేపీ పెద్దల చేతిలో పెట్టేసరికి, వారు కీలుబొమ్మలా జగన్ రెడ్డిని ఆడిస్తున్నారు. మళ్లీ అధికారం నిలుపుకోవాలంటే ముందస్తుకి వెళ్లాలనేది జగన్ ఆలోచనే అయినా బీజేపీ పెద్దలు ఒప్పుకుంటేనే అడుగు ముందుకు వేయగలడు. జగన్ ఏమి చేసినా, కేంద్రం ఎంత ఆదుకున్నా ఈ సారి వైసీపీ గెలిచే అవకాశమే లేదు. అందుకే ముందస్తుకి వెళ్లకుండా ఐదేళ్లపాటు దొరికినంత దోచుకునేందుకే మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. ముందస్తుకి వెళ్లనప్పుడు మరింత మంది ఎమ్మెల్యేలతో వైరం ఎందుకు అనే ఆలోచనతోనే నేటి సమావేశంలో ఆల్ ఈజ్ వెల్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
జగన్ ముందస్తుకు వెళ్తారా ? జగన్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటి ?
Advertisements