సిబిఐ కోర్ట్ తీర్పుతో లోటస్ పాండ్ లో విషాద ఛాయలు లాంటివి అలుముకున్నాయి... అంతా నిశబ్ధం... సిబిఐ కోర్ట్ పర్మిషన్ ఇస్తుంది, ఇంకో ఆరు నెలలు కోర్ట్ కు వెళ్ళాల్సిన పని లేదు, దీన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి అంటూ, జగన్ నిన్న రాత్రే ముఖ్య నాయకులని రమ్మని పిలుపు ఇచ్చారు.. సాక్షి లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేశారు.. జగన్ కు బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇచ్చేలా, కధనాలు కూడా రెడీ అయ్యాయి.... కాని కధ అడ్డం తిరిగింది.... సెలెబ్రేట్ చేసుకుందాం అని మీటింగ్ ప్లాన్ చేసుకుంటే, చివరకు ఓదార్పు మీటింగ్ అయ్యింది... లోపల ఎలాంటి ఫీలింగ్ ఉన్నా, అందరూ జగన్ ని ఓదార్చారు...
ముందుగా అనుకునట్టు, వైసీపీ ఎల్పీ సమావేశం ఉంది... కాని, జగన్ కు మూడ్ బాగోలేకపోవటంతో ఆ సమావేశం రద్దు అయింది... దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎమ్మల్యేలు, సమావేశం రద్దు అవటంతో, అసహనానికి లోనయ్యారు... ఎంతో దూరం నుంచి ఇక్కడ దాకా వస్తే, ఆయనకు మూడ్ బాగోపోతే రద్దు చెయ్యటం ఏంటి అని గొణుక్కుంటూ వెనుదిరిగారు... అయితే జగన్, కొంత మంది సన్నిహితులని లోటస్ పాండ్ లో ఉండమన్నారు... విజయసాయి రెడ్డి, చెవి రెడ్డి, పెద్ది రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తో ఓదార్పు మీటింగ్ చేశారు...
కోర్ట్ తీర్పు నేపధ్యంలో, ఏమి చెయ్యాలి ? 5 రోజులు పాదయత్ర చేసి, కోర్ట్ కి వచ్చి, మళ్ళీ పాదయాత్ర అంటే, అది అతి పెద్ద సెల్ఫ్ గోల్ అవుతుంది... ప్రతి శుక్రువారం మనం కామెడీ అయిపోతాం... పాదయాత్ర రద్దు చేసుకుని బస్సు యాత్ర చేద్దామా అని మిగతా నాయకులు అంటే, జగన్ మాట్లాడుతూ మాది మడం తిప్పే వంశం కాదు అని సమాధానం ఇచ్చారు.. ఇలాగే నంద్యాలలో, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏకగ్రీవం చెయ్యల్సింది పోయి, పోటీ పెట్టి బొక్క బోర్లా పడ్డాం అని ఇంకో నాయకుడు అంటే, జగన్ ఆ విషయం మరచిపోమని చెప్పనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు... మరో పక్క, నవంబర్ రెండవ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అని, ఫిబ్రవరిలో బడ్జట్ సమావేశాలు ఉంటాయి అని, వాటికి జగన్ హాజరు కావాలా వద్దా ? హాజరు కాకుంటే, ఎవరు లీడ్ తీసుకోవాలి అని విషయం పై కూడా చర్చించారు... జగన్ మాట్లాడుతూ, చెవి రెడ్డి కాని, కొడాలి నాని కాని, రోజాకి కాని, అసెంబ్లీ లీడ్ చేసే అవకాశం ఇద్దాం అని చెప్తే, అక్కడ ఉన్న నాయకులు ఎన్ని సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాం అని జగన్ మీద రివర్స్ అయ్యారు... చివరకు, అటు పాదయాత్ర పై కాని, ఇటు అసెంబ్లీ సమావేశాల పై కాని, క్లారిటీ రాకుండానే జగన్, ప్రశాంత్ కిషోర్ తో వీడియో కాన్ఫరెన్స్ ఉందని వెళ్ళిపోయారు...