నెల్లూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్న జగన్, ఈ రోజు సాయంత్రం ఉన్నట్టు ఉండి, పాదయత్ర అర్ధాంతరంగా ఆపేశారు.. షడ్యుల్ కన్నా ముందే, పాదయాత్ర ఆపి, ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు... నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దకొండూరులో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర శిబిరం వద్ద ఈ సమావేశం జరుగుతోంది... పార్టీకి చెందిన నేతలు అనేకంటే, పార్టీలో ఉన్న జగన్ సన్నిహితులతో మీటింగ్ అనటం దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది... దగ్గరగా ఉండే నేతలు, జగన్ కు నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ మీటింగ్ లో పాల్గున్నారు...

jagan padayatra 12022018 2

ఈ సమావేశంలో జగన్ కి అన్నిట్లో తోడు ఉండే విజయసాయిరెడ్డి, బంధువు అయిన మిథున్ రెడ్డి, వ్యాపార భాగస్వామి అయియన్ మేకపాటి, జగన్ కు కేసులలో తోడుగా ఉండే బొత్స, మోపిదేవి, ధర్మాన, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు... ముఖ్యంగా, ఈ వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల పై జగన్, అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు సమాచారం... ప్రశాంత్ కిషోర్ వీక్లీ సర్వేలో, షాకింగ్ రిజల్ట్స్ బయటకి రావటంతో, ఏమి చెయ్యాలో అర్ధం కాక, జగన్ ఈ మీటింగ్ పెట్టారు...

jagan padayatra 12022018 3

కేంద్ర బడ్జెట్ లో అన్యాయం పై, జగన్ - బీజేపీ కుమ్మక్కు అయిపోయారు అనే ప్రచారం, ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది అని ప్రశాంత్ కిషోర్ సర్వే సారంశం... దీని డ్యామేజ్ కంట్రోల్ ఏంటో ప్లాన్ చెయ్యటానికి జగన్ ఈ సమావేశం పెట్టారు... మోడీ మాత్రం, ఇప్పటికీ, ఎప్పటికీ మనం ఒక్క మాట కూడా అనకూడదు, అనలేము కూడా.. చంద్రబాబునే టార్గెట్ చెయ్యాలి... కాని ప్రజల్లో, మనం మోడీని కూడా ఎదురిస్తున్నట్టు కనపడాలి... దాని కోసం ఏమి చెయ్యాలో చెప్పండి అంటూ, జగన్ ఈ సమావేశం పెట్టారు... మరి చివరకు, ఏమి తెలుస్తారో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read