ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, కోర్టుకు హాజరయ్యే శుక్రవారాలతో కలిపి ఇప్పటికి 237 రోజుల పాదయాత్ర చేసారు. అయితే, అత్యధికంగా పాదయాత్ర చేసింది మాత్రం, తూర్పు గోదావరి జిల్లాలో. 63 రోజులు పాదయత్ర తూర్పు గోదావరి జిల్లాలోనే సాగింది. దీనికి ప్రధాన కారణం, ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉందని, అందుకే అక్కడ వారిని కట్టడి చేస్తే, దీని ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందని జగన్ అభిప్రాయం. వ్యూహాత్మకంగా పట్టు సాధించాలన్న ఆయన ఎత్తుగడ అంతగా పారినట్టు కనిపించలేదు. తమ అధినేత పాదయాత్రతో తూర్పు రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఆశపడిన ఆ పార్టీ నాయకులకూ ఇప్పుడు అర్థంకాని గందరగోళ పరిస్థితి.

jagan 14082018 2

ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్రకు చాపకింద నీరులా చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి వెంటాడింది. ఒక పక్క కాపు రిజర్వేషన్ ల పై జగన్ సెల్ఫ్ గోల్, మరో పక్క నాయకుల్లో ఉన్న విభేదాలు. తెర వెనుక పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసినా లెక్కచేయలేదు. కొందరైతే ఆయన జిల్లాలో ఉండగానే జెండా మార్చేశారు. జగన్‌ వ్యూహాత్మకంగానో, ఆవేశపూరితంగానో చేసిన వ్యాఖ్యానాలు పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లు పెను దుమారాన్నే రేపాయి. జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైనం ఇప్పటికీ ఆ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. తుని ఘటనలో సీఎం చంద్రబాబే రైలు తగుల బెట్టించారన్న ఆరోపణ సైతం పేలలేదు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి నుంచీ స్పందన కరువు.

jagan 14082018 3

జూన్‌ 12న రోడ్‌ కం రైలు బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించి, బ్రిడ్జి ఊగిపోయింది అని చెప్పుకున్న జగన్, ఈ రోజు ఈ జిల్లా వదిలి, వైజాగ్ వెళ్ళే సమయానికి, తన పార్టీ ఊగిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద జగన్‌ పాదయాత్ర అనుకూల ప్రభావం చూపించడంకన్నా తలనొప్పులు తెప్పించిందనే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు. బీసీలను దరి చేర్చుకుందామన్న ప్రయత్నం రామచంద్రపురంలో గందరగోళానికి గురిచేయగా, జగ్గంపేటకు చేరేసరికి కాపులపై తన ద్వంద్వం వైఖరితో మరింత నష్టపోయారని కొందరు చెబుతున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకాగా, సొంత పార్టీ నాయకులను ఇబ్బందిలో పడేసిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రైలు తగులబెట్టించారన్న ఆరోపణలు కూడా కలిసిరాకపోగా చవుకబారు రాజకీయంగా ఉందని మరికొందరు చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read