జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పెద్దలు తెలివిగల వాళ్ళం అనుకుంటారో, లేక ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారో కానీ, ఇష్టం వచ్చినట్టు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ఇప్పుడు వారికే బాక్ ఫైర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతూ, కనీసం అందులో ఏమి ఉంది అనే విషయం కూడా పట్టించుకోకుండా చేసిన తీరు, అందరినీ ఆశ్చర్య పరిచింది. గత మూడు రోజులు స్పీచ్ల గురించి పక్కన పెడితే, అంతకు ముందు జంగారెడ్డి గూడెం సంఘటనలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, అందరినీ విస్మయానికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాణం పైన ఆయనకు బాధ్యత ఉంటుంది. అలాంటిది ఎకంగా 40 మంది కల్తీ సారాతో మరణిస్తే, అవి సహజ మరణాలని, దేశంలో మనుషులు చనిపోతూ ఉండటం, సర్వ సాధారణం అంటూ, ఆయన లెక్కలు చెప్పిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎలా మాట్లాడతారు అంటూ సామాన్య ప్రజలు కూడా అభిప్రాయ పడ్డారు. ఇక గత మూడు రోజులుగా, మూడు కీలక అంశాల పై జగన్ మాట్లాడారు. ఒకటి పోలవరం, రెండు మద్యం, మూడు అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.
ఈ మూడు విషయాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగాలు అయితే ఇచ్చారు కానీ, ఆయన ముఖ్యమంత్రి, అయన చేతిలో అధికారం ఉంది అనే సంగతి మర్చిపోయారు. తన అసమర్ధతను తానే చాటుకున్నారు. పోలవరం పైన చర్చలో, ఇప్పటికీ ఎందుకు పోలవరం పూర్తి కాలేదో చెప్తూ, చంద్రబాబు వల్లే పూర్తి కాలేదని చెప్పిన తీరు, అందరినీ షాక్ కు గురి చేసింది. 3 ఏళ్ళు అయినా చంద్రబాబు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇక మద్యం విషయంలో,అవన్నీ చంద్రబాబు ఇచ్చిన అనుమతులు అని చెప్పారు,మరి ఇన్నాళ్ళు మీరు ఎందుకు రద్దు చేయలేదు అంటే సమాధానం లేదు, అదేమంటే చంద్రబాబు మా మద్యం ఆదాయం రాకుండా చూస్తున్నాడు అంటూ సెల్ఫ్ గోల్ వేసి, మద్య నిషేధం హామీని గాలికి వదిలేసారు. ఇక నిన్న మూడు రాజధానుల అంశం, నిన్న హైకోర్టుకే పాఠాలు చెప్పిన జగన్, ఇవన్నీ కోర్టులో ఎందుకు వాదించలేదు ? అసలు తీర్పు నచ్చక పోతే, ఇప్పటికీ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అనే చర్చ నడుస్తుంది. ఇలా ప్రతి అంశంలోనూ జగన్ ఎక్ష్పొజ్ అయ్యారు.