అసెంబ్లీకి రాడు.. పార్లమెంట్ కు పంపించడు.. ప్రజా సమస్యల మీద పోరాటం చెయ్యమంటే, నేను సియం అయిపోతున్నాను, అప్పుడు చేస్తున్ను అంటాడు.. పాదయాత్ర అంటూ సంవత్సరం నుంచి సాగ దీస్తూ, శుక్రవారం కోర్ట్ కి పోయి, ఒక రోజు రెస్ట్ తీసుకుని, ఎదో అలా అలా టైం సాగదీస్తూ, కాలం గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డికి, ప్రజలలో పూర్తిగా సానుకూలత పోయింది. జగన్ కు ఉన్న ఒకే ఒక్క అర్హత, వైఎస్ఆర్ కొడుకుగా గుర్తింపు.. 2014లోనే ఆ సెంటిమెంట్ పోయింది. 2014 నుంచి ప్రతిపక్ష నేతగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రజల సమస్యలతో ఏ మాత్రం సంబంధాలు లేకుండా, తాను చెయ్యాలి అనుకున్న పాదయాత్ర చేస్తూ, వెళ్ళిపోతున్నాడు. చివరకు తుఫాను లాంటి విపత్తులు వచ్చినా, అటు వైపు తొంగి చూడటం లేదు.
సొంత మీడియాలో డబ్బా కొట్టుడు తప్ప, ఎక్కడా జగన్ టాపిక్ అనే మాటే లేదు. బీజేపీకి పూర్తిగా సరెండర్ అవ్వటం, కేసుల కోసం, విజయసాయి రెడ్డి చేత ఊడిగం చేపియ్యటం, అమిత్ షా ఏది ఆడమంటే, అది ఆడటంతో, ప్రజల్లో మరీ పలుచన అయిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ కొంచెం ఆక్టివ్ అయిన తరువాత, మరీ సోయలో కూడా లేకుండా పోయాడు. దీంతో జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామాకు తెర లేపాడు. అది కూడా పెద్ద ఫ్లాప్ షో అయ్యింది. రెండు రోజుల మాట్లాడుకున్న ప్రజలు, జగన్ మోహన్ రెడ్డి డ్రామాలు అర్ధమై పోయి, కోడి కత్తి గురించి పట్టించుకోవటం కూడా మానేశారు. చివరకు కోడి కత్తితో గుచ్చించుకున్నా, పాపం జగన్ మోహన్ రెడ్డికి, రావాల్సిన మైలేజి రాలేదు.
దీంతో ఇప్పుడు జగన మోహన్ రెడ్డి ఫ్యామిలీ డ్రామాకు తెర లేపారు. 2012లో తన అరెస్ట్ జరిగినప్పుడు నుంచి, తను బెయిల్ మీద బయటకు వచ్చే దాకా, ఎలాంటి ఫ్యామిలీ డ్రామా నడిచిందో, ఇప్పుడు మళ్ళీ అలాంటి డ్రామాకు తెర లేపారు. వైఎస్ జగన్ తల్లి, విజయమ్మ రేపు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. జగన్ పై కోడి కత్తి దాడి, తరువాత టిడిపి నాయకులు చేసిన ర్యాగింగ్ సహా పలు అంశాల పై విజయమ్మ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి మిగతా కుటుంబ సభ్యులు కూడా హాజరు కానున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి, చివరకు తన ఇంట్లో వాళ్ళ చేత, మళ్ళీ 4 ఏళ్ళ తరువాత రాజకీయాలు మాట్లాడించనున్నారు. చంద్రబాబు పై విమర్శలు, కొడుకు పై సెంటిమెంట్ పిండించే డైలాగులతో, ఆదివారం పూట విజయమ్మ టీవీల ముందు ప్రత్యక్షం కానున్నారు. పాపం, జగన్ వేసిన ఈ ఐడియా అయినా వర్క్ అవుట్ అవుతుందో లేదో..