ప్రధాని మోడీని కలిసిన తరువాత, జగన్ మోహన్ రెడ్డి చాలా రిలాక్స్ గా ఉన్నారు... పరిణామాలు కూడా అలాగే జరిగాయి... దీంతో జగన్ బ్యాచ్ మొత్తం చాలా హ్యాపీగా ఉంది... కాని నిన్న కెసిఆర్ చేసిన కామెంట్ తో, జగన్ గుండెల్లో దడ మొదలైంది... కెసిఆర్ చెప్పింది నిజమేనా అని, ఢిల్లీ వర్గాలను కొనుక్కోమని విజయసాయిని పంపించాడు జగన్... విషయం మీద క్లారిటీ లేకపోయినా, కెసిఆర్ చెప్పింది వాస్తవమే ఏమో అని, జరుగుతున్న సంఘటనలు అలాగే ఉన్నాయని, విజయసాయి చెప్పటంతో, జగన్ మరింత ఆందోళనలో ఉన్నారు...
విషయం ఏమిటి అంటే, నియోజకవర్గాల సంఖ్య పెంపు కచ్చితంగా జరగబోతోందని కేంద్రం నుంచి సమాచారం ఉంది అని, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు... తెలంగాణాకి పెరిగితే, ఆటోమేటిక్ గా మన ఆంధ్రప్రదేశ్ కు కూడా పెరుగుతాయి... దీనికి సంబంధించి కసరత్తు జరుగుతుంది అని చంద్రబాబు వద్ద కూడా సమాచారం ఉంది... సరిగ్గా ఈ పాయింట్, జగన్ బ్యాచ్ ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.... ఇది కనుక జరిగితే, ఇక ఒక్క నాయకుడు కూడా మిగలడు అని జగన్ అభిప్రాయం...
తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, వలసలను ప్రోత్సహించటం ఆపింది... పాదయాత్ర మొదలు పెట్టగానే, వాలసలు ఉంటాయి అని అటు జగన్ కి కూడా తెలుసు... అయితే, కొంత మంది నాయకులు మాత్రం, తెలుగుదేశంలోకి వెళ్తే సీట్ రాదేమో అని ఉద్దేశంతో, ఉండిపోతున్నారు... ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంపు ఉంది అని తెలిస్తే, ఈ వలసలు ఊపందుకుంటాయి.... ఇది ఇలా ఉండగానే, జగన్ కు ఇంకో సమస్య... ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో కాండిడేట్ లేక ఇబ్బంది పడుతున్న జగన్ కు, ఇది ఇంకో సమస్యగా మారుతుంది... అందులోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఆ డ్యామేజ్ ఏంటో జగన్ కు తెలుసు... వీటన్నిటిని అలోచించి జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు... ఎలా అయినా నియోజకవర్గాల పెంపు ఆపాలి అని, కేంద్రంతో లాబీయంగ్ మొదలు పెట్టారు...