ప్రతి రోజు జగన్ తన పాదయాత్ర డైరీ రాస్తున్న సంగతి తెలిసిందే... తన ముఖ్యమంత్రి కుర్చీ సంకల్ప యాత్రలో, రొజూ ఎన్ని గంటలకు లెగుస్తాడు, ఏ ఊరు వెళ్ళేది, ఎవర్ని కలిసిదే రాసుకుంటూ, చివర్లో మాత్రం, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ సమస్యలు తీరుస్తాను అని రాసి, తన డైరీ మూసేసి పడుకుంటాడు... అయితే ఇవాళ శుక్రవారం, కోర్ట్ ముందు హాజరు కావలి కాబట్టి, పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు... సాక్షి ఛానల్ కూడా ఏమి చూపించాలో అర్ధం కాక, పిచ్చి ప్రోగ్రాంలు వేసుకుంటూ, వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్నారు... మరో పక్క ప్రశాంత్ కిషోర్ టీం కూడా రిలాక్స్ అయ్యింది... జగన్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో రిలాక్స్ డ్ గా ఉన్నారు కాబట్టి, వాళ్ళ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.. మరి ఇవాళ జగన్ డైరీ ఎవరు రాస్తారు ? అసలు ఇవాళ జగన్ డైరీ రాస్తే ఎలా ఉంటుంది ?

jagan dairy 10112017 2

"ఇవాళ పొద్దున్నే నేను ముఖ్యమంత్రి అయ్యినట్టు, ఇడుపులపాయలో సెక్రటేరియట్ ఉన్నట్టు, హోం మినిస్టర్ గా అంబటి ఉన్నట్టు... కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని జైలుకి పంపినట్టు కలలో ఎదో ఎదో అరుస్తుంటే, డిప్ప మీద ఎవరో టపీ మన కొట్టారు... నిద్ర లెగిసి చూస్తే లోటస్ పాండ్ లో ఉన్నాను... అదేంటి ఇక్కడ ఉన్నాను, కడపలో ఉండాల్సిన వాడికి ఇక్కడకి ఎలా వచ్చాను అని అడిగితే, ఇవాళ శుక్రవారం నాన్న, అని మా అమ్మ చెప్పెంది... రాత్రి అంబటి రాంబాబుకి చెప్తే, నన్ను నిద్రలోనే కార్ లో ఏసుకు వచ్చారు అంట... సరే కోర్ట్ కి వెళ్ళాలిగా తప్పదు, జడ్జి గారు ఊరుకోరు... ఏమన్నా తేడా వస్తే సిబిఐ ఊరుకోదు, అసలకే బెయిల్ మీద బయట తిరుగుతున్నా.... రెడీ అయ్యి, కోర్ట్ కి బయలుదేరగానే, మా అత్త సబితమ్మ కనిపించింది... నీ పుణ్యమా అని, నన్ను కూడా కోర్ట్ కి లాగావు కదరా అని నాలుగు దులుపింది.... తరువాత శ్రీ లక్ష్మి ఐఏఎస్ కనిపించారు... ఆమె చూపులతోనే నన్ను తిట్టేస్తుంది... ఎందుకులే అని ఆమె వైపు కూడా చూడకుండా లోపలకి వెళ్తూ ఉంటే, మా అన్న గాలి జనార్ధన్ రెడ్డి కనిపించాడు... కనిపించగానే ఎమోషన్స్ ఆపుకోలేక వాటేసుకున్నాడు... ఎంతైనా నేను అంటే పిచ్చి, కదా పిచ్చి సన్నాసికి..."

jagan dairy 10112017 3

"గాలన్న నేను లెక్కలు గురించి మాట్లాడుతుంటే, పక్కన విజయసాయి రెడ్డి అన్నీ వింటున్నాడు... సాయన్నను చెవులు మూసుకోమని చెప్పాను... ఇంతలో జడ్జి గారు వచ్చారు... అలా మధ్యానం లంచ్ టైం అయ్యింది... ఇంతలో రొజూ కోర్ట్ లో కనిపించే బాయ్ వచ్చి, సార మా కెసిఆర్ హైదరాబద్ రోడ్డులు చెడగోట్టాడు చస్తున్నాం అన్నాడు... నేను సంవత్సరంలో ముఖ్యమంత్రి అవుతాను, అవ్వగానే హైదరాబాద్ లో రోడ్డులు వేపిస్తా అని చెప్పాను... ఇంతలో అంబటి, అది హైదరాబాద్, ఆంద్ర రాష్ట్రంలో లేదు అని గుర్తు చేశాడు... నేనే సియం అని అనీ అనీ అలవాటు అయిపోయి, అక్కడ కూడా నేన్ సియం అనుకున్నాను... అంబటి మాంచి హైదరాబాద్ బిర్యానీ తెప్పించాడు... అది లాగించి, మళ్ళీ కోర్ట్ లోపలకి వెళ్ళాను... నా ఖర్మకి మళ్ళీ వచ్చే శుక్రవారం రమ్మని జడ్జి గారు చెప్పారు... సరే అని నమస్కారం చెప్పి, బయలుదేరాను... ఏదేమైనా, ఇంకో సంవత్సరం... నేనే సీయం అవుతాను అన్ని సమస్యలు తీరుస్తాను.... నాకోసం మీరందరూ గెట్టిగా ప్రార్ధించండి... ఇట్లు కాబోయే సియం జగన్ రెడ్డి"

Advertisements

Advertisements

Latest Articles

Most Read