ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని స్పష్టంగా చెప్పిన కేసీఆర్‌... మిషన్‌ మొదలు పెట్టారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏపిని తన గుప్పిట్లో పెట్టుకోవటానికి, చంద్రబాబును ఓడించాల్సిందేనని ఆయన గట్టిగా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రెస్‌మీట్‌లో చంద్రబాబుపై విమర్శలకే ఆయన ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఏపీ ప్రతిపక్ష నేతతో సమావేశానికి టీఆర్ఎస్ సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఏ క్షణమైనా... సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ రావొచ్చు. సమయం తక్కువగా ఉన్నందునే జగన్‌తో కేటీఆర్‌ సమావేశం అయ్యారన్న మాట వినిపిస్తోంది. ఈ ఇద్దరి మధ్య చర్చల్లోనూ ఏపీ రాజకీయ అంశాలే ప్రధానంగా వచ్చాయి. అయితే ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్‌, కేటీఆర్‌ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుంది..? టీఆర్‌ఎస్‌ నేరుగా ఏపీ గ్రౌండ్‌లోకి దిగుతుందా..? ఇక్కడ రంగప్రవేశం చేసే అవకాశం ఉంటుందా...? అంటే.. ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

jaggugelpu 16012019 2

టీఆర్‌ఎస్‌ నేతలకు వైసీపీ నేతలకు మధ్య సాన్నిహిత్యం ఉంది. టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. సంబరాలు చేసుకునేంత ఫ్రెండ్‌షిప్‌ నెలకొంది. అందుకే ఇక్కడ నేరుగా రంగంలోకి దిగకుండా.. వైసీపీని ఏపీలో బలపరచడం టీఆర్ఎస్ మొదటి వ్యూహమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి అవసరమైన అన్ని అండదండలు అందించాలి. ఎన్ని రకాలుగా సాయం చేయగలరో.. అన్ని రకాలుగా జగన్‌ పార్టీకి టీఆర్ఎస్ సాయం చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇది కేసీఆర్‌ చెబుతున్న రిటర్న్‌ గిఫ్ట్‌లో ఓ కోణం..! ఇక రెండోది...! మిత్రుడి కోసం మరో మిత్రుడిని రంగంలోకి దించడం..! టీఆర్‌ఎస్‌ మిత్రపక్షం ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ ఇప్పటికే ఐ యామ్‌ కమింగ్‌ టు ఏపీ అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఏపీకి వస్తున్నాను.. కాచుకో అన్న రేంజ్‌లో చంద్రబాబుకు సవాల్ విసిరారు. అయితే ఓవైసీ ద్వారా జగన్‌కు కేసీఆర్ మేలు చేయడం మరో కోణంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

jaggugelpu 16012019 3

కర్నూలు, గుంటూరు లాంటి చోట్ల మైనారిటీ ప్రాబల్యం ఎక్కువుగా ఉంది. ఇలాంటి చోట్ల ఎంఐఎం పోటీ చేయడం మరో ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఇపుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసిపోయాయి. ఎంతగా అంటే.. తెలంగాణలో తాము ఓవైసీ స్థానం తప్ప అన్ని గెలుస్తామని చెబుతున్నారు. ఆ స్థానంపై ఫోకస్‌ కూడా చేయడం లేదు టీఆర్‌ఎస్‌. ఇపుడు ఏపీలో కూడా ఇంతే..! ఎంఐఎం రంగంలోకి దిగుతుంది. వైసీపీకి సపోర్ట్‌ చేస్తామని చెబుతోంది.. అంటే ఈ రెండు పార్టీలకు సంధానకర్తగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న మాట..! తద్వారా టీడీపీ వైపు మళ్లే ముస్లిం ఓటర్లను ఎంఐఎం ద్వారా వైసీపీకి దగ్గర చేయడం రెండో వ్యూహం. అంటే ఎలా చెప్పుకున్నా.. కేసీఆర్‌ నేరుగా ఏపీలో దండయాత్రకు దిగే అవకాశం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నేరుగా రంగంలోకి దిగితే.. నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్న భావన రెండు పార్టీల నేతల్లోనూ వ్యక్తమవుతోంది. 2009లో మహాకూటమి అంటూ జట్టు కట్టినప్పటికీ... తెలంగాణ దాటి ప్రచారం చేయలేదు కేసీఆర్‌. కేవలం హైదరాబారాద్‌, తెలంగాణలో మాత్రమే చంద్రబాబుతో కలిసి ప్రచారం చేశారు. తాజాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశవ్యాప్తంగా పార్టీలతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ... ఏపీకి మాత్రం కేసీఆర్ వెళ్లలేదు. అయితే వైసీపీతో భేటీ తర్వాత ఇప్పుడు ఏపీకి వస్తారా..? అంటే డౌటేనంటున్నాయి పార్టీ వర్గాలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read