జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి, ప్రతిపక్షాలు ఆయన పై విమర్శలు గుప్పించాయి. అసలు జగన్ ఢిల్లీ టూర్ ఎందుకో, ఎవరికీ తెలియదు. ఎందుకంటే, అక్కడ నుంచి అధికారిక సమాధానం ఉండదు. ఎవరికీ నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. ఏదో లీకులు ఇచ్చి, ఇదే మా అజెండా ని చెప్తారు. లోపల ఏమి జరుగుతుందో, ఎవరికీ తెలియదు. అయితే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అనేక విమర్శలు వచ్చాయి. వివేక కేసు విషయం అని, తన సొంత కేసులు విషయం అని, షర్మిల పార్టీ విషయం అని, ఇలా అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎట్టకేలకు, అసలు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళారో, అర్ధం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రూ.2500 కోట్ల అప్పు తీసుకుని వచ్చారు. అలా జగన్ మోహన్ రెడ్డి గన్నవరం లో దిగారో లేదో, ఇలా అప్పు వచ్చేసింది. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా ? చాలా గొప్ప ఉందండి బాబు. ఎందుకంటే, మన ప్రభుత్వం అప్పుల విషయంలో చేసిన అవకతవకలు అన్నీ కేంద్రం పసి గట్టేయటంతో, అప్పులు లేకుండా పోయాయి. గాతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి అప్పుల కోసం ఢిల్లీ వెళ్ళే వారు, తరువాత ప్రినిసిపల్ సెక్రటరీ వెళ్ళే వారు, ఆ తరువాత బుగ్గన వెళ్ళే వారు. రోజుల తరబడి ఢిల్లీలోనే ఉంటూ, అప్పుల కోసం ప్రయత్నాలు చేసే వారు.
అయితే ఈ సారి మాత్రం, బుగ్గన వెళ్ళినా పని అవ్వలేదు. ఏపి ప్రభుత్వం అన్ని అప్పులు ఎడా పెడా చేసేయటంతో, ఇక అప్పు ఇచ్చే వారు లేకుండా పోయారు. ఇక చేసేది లేక జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి, అప్పుల కోసం ప్రయత్నం చేసారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఆర్ధిక మంత్రిని కలిసి, కష్టాలు చెప్పుకున్నారు. ఈ సారి ఇంకా జీతాలు ఇవ్వలేదని, జీతాలు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని, ఆదుకోవాలని చెప్పటంతో, రెండో రోజే ఆర్బిఐ నుంచి అదనపు అప్పు ఇస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అయితే అప్పు వచ్చిందో లేదో, గంటల్లోనే ఖాళీ అయిపొయింది. అందులో కొంచెం ఆర్బిఐ ఓవర్ డ్రాఫ్ట్ కింద మినాయించుకోగా, మిగిలినవి జీతాలకు సద్దారు. అయినా కూడా ఇంకా పూర్తిగా పెన్షన్లు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఏదైతేనేం, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అప్పు సాధించుకుని వచ్చారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉండి. గడిచిన 8 రోజుల్లో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.4750 కోట్ల అప్పు చేసింది.