జగన్ అనే బుడగ బద్దలయ్యే సమయం వచ్చిందా ? 12 ఏళ్ళ నుంచి పెరుగుతూ వచ్చిన గాలి బుడగ, ఇక పేలిపోయే సమయం వచ్చిందా ? జగన్ మోహన్ రెడ్డి బలహీనతలు అన్నీ బయటపడుతున్నాయా ? ప్రజల్లో వ్యతిరేకతతో పాటుగా, సొంత పార్టీలో కూడా జగన్ మీద నమ్మకం పోతుందా ? నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే సమాధానమే వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితి ఎదురైందనే చెప్పాలి. ఇన్నాళ్ళు తనకు ఎదురు లేదు, తానో మోనార్క్ అని భావించిన జగన్ రెడ్డికి, నిన్నటి నుంచి సొంత పార్టీ నేతలే సినిమా చూపిస్తున్నారు. మరో రెండేళ్ళ అధికారం ఉందని తెలిసినా, జగన్ ను ఈక ముక్కను తీసి పడేసినట్టు తీసి పడేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎంతో బలంగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని నమ్మించారు కానీ, జగన్ బలంగా లేడు, అదో గాలి బుడగ మాత్రమే అని అర్ధమైంది. మంత్రి వర్గ మార్పు చేర్పులతో జగన్ మోహన్ రెడ్డి బలహీనత మొత్తం బయట పడింది. తనకు తిరుగు లేదని తనకు తాను భ్రమ పడే జగన్ రెడ్డికి, అసలు వాస్తవం నిన్నటితో బయట పడింది. అసెంబ్లీలో భజనలు చూసి, నేనో గోప్ప రాజుని అనుకునే జగన్ రెడ్డికి, తన పైన సొంత పార్టీలోనే ఇంత వ్యతిరేకత ఉందని, అసలు ఊహించి ఉండరు.
పార్టీ సీనియర్ నేతలతో పాటుగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి , సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, శిల్పా చక్రపాణిరెడ్డి, కరణం ధర్మశ్రీ,, రక్షణనిధి, ముస్తఫా, అన్నా రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇలా దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే జగన్ పై వ్యతిరేకత వ్యక్తం చేసారు. మరో 40 మంది వరకు, లోలోపల రాగిపోతూ, మిగిలిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి, ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి గాలి బుడగ పేలిపోయే సమయం దగ్గర పడింది. ఒక పక్క ఇప్పటికే ప్రభుత్వం గాడి తప్పింది, పెంచిన చార్జీలు ఒక వైపు, అసమర్ధ పాలన మరో వైపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సొంత పార్టీలో నేను చెప్పిందే వేదం ఆని భావించిన జగన్ రెడ్డికి, సొంత పార్టీ నేతలే సినిమా చూపిస్తున్నారు. మరో రెండేళ్ళు మిగిలి ఉండగానే, ఇంత అసంతృప్తి నేతల్లో ఉంటే, రాను రాను జగన్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధమవుతుంది.