ఇప్పటికే బీజేపీ - టిడిపి మధ్య బంధం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థుతుల్లో ఉంది... ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా, తద్వారా తన సొంత ప్రయోజనాలు, కేసులు ఒక కొలిక్కి వచ్చేలా, జగన్ మోహన్ రెడ్డి కూడా ప్లాన్ వేస్తున్నారు... ఈ వేడిలోనే, మరో సారి ప్రధాని నరేంద్ర మోడీని కలవాలాని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు... ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నా, ఇది ఇంకో మూడు నాలుగు నెలలు కొనసాగుతుంది కాబట్టి, ఈ లోపే పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి, ప్రధానిని కలిసి, మరింత దగ్గరవ్వాలని జగన్ ప్రయత్నిస్తున్నారు... ప్రధానితో అపాయింట్మెంట్ విషయం చూడామని, ఇప్పటికే విజయసాయి రెడ్డిని పురమాయించాడు జగన్...

jagan 31012018 2

ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి, మార్చ్, ఏప్రిల్ నెలలో అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ప్రధాన మంత్రి ఆఫీస్ చుట్టూ, విజయసాయి రెడ్డి తిరుగుతునట్టు సమాచారం... ఈ విషయాన్ని వైసీపీ నేతలు కూడా ధృవీకరిస్తున్నారు... లోక్ సభకు ముందుస్తు ఎన్నికలు వస్తాయి అనే హడావిడి నేపధ్యంలో, ఈ లోపే అన్ని విషయాలు కొలిక్కి వచ్చేస్తే క్లారిటీ ఉంటుంది అని భావించిన ప్రశాంత్ కిషోర్ ఐడియా మేరకు, జగన్, ప్రధానిని కలవనున్నారు...

jagan 31012018 3

చాలా కాలం నుంచి వైసీపీ , రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటుంది.... రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, చంద్రబాబు ప్రభుత్వం పై అవకాసం దొరికిన ప్రతి సారి విరుచుకుపడుతున్నారు... ఏకంగా, వైసిపీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్లు పెట్టే అంత దగ్గర అయిపోయారు... ఈ నేపధ్యంలో, బీజేపీతో, జగన్ పొత్తు పై చర్చలు జరుపుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి... జాతీయ మీడియా కూడా ఇదే విషయం పై పలు కధనాలు కూడా వేసింది... చంద్రబాబు కూడా, రాష్ట్రానికి ఏ సహాయం చెయ్యని బీజేపీని వదిలించుకోవటానికే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది... ఈ అన్ని పరిణామాలు తనకు అనుకూలంగా మార్చుకుని, కేసుల నుండి విముక్తి పొందటానికి, జగన్ వేగంగా స్పందించి, బీజేపీ పెద్దలతో, ప్రధానితో భేటీ అవ్వాలని, నిర్ణయించుకున్నారు... అవసరమైతే, ఒక వరం రోజులు (శుక్రవారం, కోర్ట్ వారం మినహా), పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి, ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read