జగన్ మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే, ఎవరు ఏమై పోయినా, ఎవరికి ఎంత నష్టం జరిగినా, అతను పట్టించుకోడు అనే అభిప్రాయం అందరిలో ఉంది. అది మొండితనం అని కొందరు అంటే, చాలా మంది మూర్ఖత్వం అని కూడా అంటారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తీసుకున్న అనేక నిర్ణయాలు ఇందుకు బలం చేకూరుస్తాయి. అయితే ఏమైందే ఏమో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డి వరుస పెట్టి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అనే పేరు అంటేనే, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అసహ్యం. అందుకే అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసి పడేసారు. రెండేళ్లుగా అక్కడ రైతులు, మహిళలు రోదిస్తున్నా, కనీసం మీ బాధ ఏంటి అని అడిగిన పాపాన పోలేదు. పైగా వారి పై కేసులు, ఆంక్షలు, అవమానాలు అదనం. రైతులను పైడ్ ఆర్టిస్ట్ లు అనేంత గొప్ప సంస్కారం. అలాంటి జగన్ మోహన్ రెడ్డి, అమరావతి బిల్లులు వెనక్కు తీసుకోవటం వెనుక ఉన్న కారణం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇప్పుడిప్పుడే కారణాలు బయటకు తెలుస్తున్నాయి. ఒక ప్రముఖ పత్రికలో ఆసక్తికర వార్త ప్రచురితం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అమరావతి విషయంలో, తన నిర్ణయం వెనక్కు తీసుకోవటం వెనుక ఢిల్లీ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ చేయటమే అని అంటున్నారు.
ఆ వ్యక్తి ఫోన్ చేసి, అమరావతి విషయంలో చాలా నష్టపోతావ్, ఏమి జరుగుతుందో ఒకసారి అలోచించుకుని, నిర్ణయం వెనక్కు తీసుకుంటే మీకే మంచిది అంటూ ఢిల్లీ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ రావటంతోనే, హడావిడిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి, నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. అయితే అంతకు ముందు రోజే, ఢిల్లీలో రైతు చట్టాలను మోడీ వెనక్కు తీసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆ ఢిల్లీ వ్యక్తి ఎవరూ అంటే, అమిత్ షా అనే అభిప్రాయం అనేక మందికి వ్యక్తం అవుతుంది. అమిత్ షా తిరుపతి వచ్చిన సమయంలోనే, అమరావతి రైతుల పై లాఠీ చార్జ్ జరిగింది. అదే సమయంలో అమిత్ షా నెల్లూరులో ఉన్నారు, సారిగ్గా ఆక్కడే ఈ సంఘటన జరిగింది. అప్పటికే కేంద్ర ఐబి వర్గాలు అమిత్ షా రాక సందర్భంగా అక్కడే ఉండటంతో, లాఠీ చార్జ్ విషయం అమిత్ షా కి నివేదించారు. ఆ తరువాత రోజే, బీజేపీ నేతలకు అక్షింతలు పాడ్డాయి. అమరావతి ఉద్యమంలో పాల్గునాలని ఆదేశాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఢిల్లీ నుంచి ఒక ప్రముఖుడు ఫోన్ చేసి, అమరావతి విషయంలో న్యాయ పరంగానే కాక, ప్రజల్లో కూడా మీకు ఇబ్బందులు తప్పవని, వెంటనే మూడు రాజధానులు సమీక్ష చేయాలని చెప్పటంనే, ఎవరికీ లొంగని జగన్ మోహన్ రెడ్డి, తప్పని సరి పరిస్థితిలో ఆ ఢిల్లీ ప్రముఖుడి మాటలకు తలోగ్గాల్సి వచ్చిందని ఆ వార్త సారంశం.