మా వంశం మాట తప్పదు, మడం తిప్పదు, మేము మాటంటే మాటే అని చెప్పే జగన్, ప్రతి రోజు ఏదో ఒక మాట తప్పుతూనే ఉన్నారు. మొన్నటి దాకా 85 లక్షల మందికి రైతు భరోసా అని చెప్పి, ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే కుదించిన సంగతిలో విమర్శలు పాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, తాను చెప్పిన మాట తప్పారు జగన్. "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పిన జగన్, ఇప్పుడు మాట తప్పారు. ఇది వరకు పదే పదే చంద్రబాబు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళారని, విమర్శలు చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలుకే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారు. ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా పధకానికి డబ్బులు లేకపోవటంతో పటు ఇతర ఖర్చులకు, ఓడీకి వెళ్లి రూ.800 కోట్లు తెచ్చుకున్నారు. ఆర్థికంగా అత్యవసరమై, అష్టకష్టాలు పడుతూ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఓడీకి వెళతారు.
అయితే గతంలో చంద్రబాబు ఓడీకి వెళ్ళిన ప్రతిసారి, జగన్ మోహన్ రెడ్డి, ఆయన పత్రిక తీవ్ర విమర్శలు చేసే వారు. దీంతో అదే తను చేస్తే, తనకు ఇబ్బంది అవుతుందని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పారు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోవటం, ఖర్చులు పెరిగిపోవటంతో, తప్పని పరిస్థితుల్లో, మాట తప్పి, మడం తిప్పల్సి వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా కోసం, డబ్బులు సర్దాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం రూ.800 కోట్లు ఆర్‌బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుని తెచ్చారు. అలాగే, ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు సాధించారు.
ఈ బండ్ల పై వడ్డీ 7.17 శాతం నమోదైంది. వేస్ అండ్ మీన్స్ ద్వారా రూ.1510 కోట్లు తెచ్చుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్ నిధులు రూ.800 కోట్లతో కలిపి మంగళవారం రైతు భరోసా కోసం ఆర్థిక శాఖ రూ.3000 కోట్లను ఆర్టీజీకి విడుదల చేశారు. మరో పక్క, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం, మన రాష్ట్రం రూ.32,000 కోట్ల రుణాలను తెచ్చుకోవచ్చు. 32 వేల కోట్లలో, రూ.29,000 కోట్ల సమీకరణకు కేంద్రం అనుమతించింది. అయితే ఇప్పటికే మన ప్రభుత్వం రూ.23 వేల కోట్ల అప్పు చేసింది. ఈ ఏడాదికి ఇంకా 6 వేల కోట్లు మాత్రమే ఉంది. మరో పక్క గత సంవత్సరంతో పోలిస్తే, ఆదాయం భారీగా తగ్గిపోయింది. దేశమంతా ఆర్ధిక సంక్షోభం ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం, ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. ముఖ్యంగా ఇసుక లేకపోవటంతో, ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.