ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కాబోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని తరుచూ కలవటం చర్చనీయంసం అయ్యింది. ఢిల్లీలో మారుతున్న పరిణామాలు, జగన్ ను రాజకీయంగా కలవర పెడుతున్నాయి. గవర్నర్ బిశ్వభూషణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. దాదాపుగా వారం రోజులు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతిని, పలువురు మంత్రులను కూడా ఆయన కలిసి రావటంతో, జగన్ లో టెన్షన్ మొదలైంది. ప్రధాని మోడీతో సమావేశం, ఆ తరువాత హోంమంత్రి అమిత్ షా తో జరిగిన సమావేశంలో కూడా, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల పై ఆయన నివేదిక ఇచ్చారు. ప్రధానంగా ఆర్ధిక శాఖకు సంబంధించి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో ఉన్న అప్పులు, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవటం, గవర్నర్ పేర హామీగా పెట్టి అప్పులు తేవటం, వీటి అన్నిటి పైన నివేదిక కోరినట్టు తెలుస్తుంది. అయితే చాలా అంశాల పై, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై, ప్రధాని మోడీ, అమిత్ షా, గవర్నర్ కు కొన్ని సూచనలు చేసినట్టు చెప్తున్నారు. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టు కాకుండా, జాగ్రత్తగా ఉండాలి అని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే గవర్నర్ దాదపుగా వారం రోజులు ఢిల్లీలో ఉండటం, అనేక మంది ముఖ్యులతో సమావేశం అవ్వటంతో, అక్కడ విషయాలు ఏమిటి, ఏమి జరిగింది అని తెలుసుకునేందుకు, జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ అపాయింట్మెంట్ కోరటంతో, ఈ రోజు సాయంత్రం 5.30 గంటలకు రావాలని గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. దీంతో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళ్తున్న నేపధ్యంలో, ఆ పర్యటన వెంటనే ముగించుకుని, సాయంత్రం గవర్నర్ తో భేటీ కావాలని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ఏమి నివేదికలు ఇచ్చారు ? కేంద్రం ఏమని చెప్పింది ? కేంద్రం ఏమి ఆదేశాలు ఇచ్చింది ? ఇలా ఇవన్నీ తెలుసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో భేటీ అయ్యి విషయాలు తెలుసుకోనున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న ఆర్ధిక విధానాలతో, దేశం కూడా నష్టపోతుందని,మరో శ్రీలంక అవుతుంది అంటూ, కేంద్రంలో ఉన్న అధికారులు కూడా మోడీకి చెప్పటంతోనే, కేంద్రం ఈ అంశం పై సీరియస్ గా ఉన్నట్టు చెప్తున్నారు.