నిన్న అసెంబ్లీలో రాజధాని పై, జగన్ మోహన్ రెడ్డి పర్యటన తరువాత, రాష్ట్రమంతా, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కన్ఫ్యూషన్ వాతవరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని, సౌత్ ఆఫ్రికాకు కూడా అలాగే ఉన్నాయని, మనకు ఉంటే తప్పు ఏమిటి, మనం కూడా మారాలి, అమరావతి లెజిస్లేటివ్ కాపిటల్ గా, విశాఖ, కర్నూల్ మరో రెండు రాజధానులుగా ఉంటాయని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటన పై రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఒక అమరావతి కాట్టలేకే, మా డబ్బులు లేవు అని చెప్తున్న ప్రభుత్వం, మూడు రాజధానులు ఎలా కడుతుంది, ఇదంతా రాజకీయంలో భాగమే అనే వాదన మొదలైంది. 90 శాతం పూర్తయిన భవనాలు అమరావతిలో ఉంటే, ఆరు నెలలుగా వాటిని పూర్తీ చెయ్యలేని ప్రభుత్వం, మరో రెండు రాజధానులు కడుతుంది అంటే ఎలా నమ్ముతాం అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ చర్చ జరుగుతున్న వేళ, ఇప్పుడు ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది.
ఈ రోజు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, మూడు రాజధానుల పై, ప్రజల ఆందోళన గురించి అడగగా, అమరావతి, కర్నూల్, విశాఖపట్నంలో, రాజధానులు ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని, ఉంటుంది అని చెప్పలేదు కదా అని, ఉండొచ్చు అనే మాటకు, ఉంటుంది అనే మాటికి తేడా చాలా ఉంది పేర్ని నాని చేసిన ప్రకటన ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూషన్ లో పడేసింది. రాజధాని పై ఏ నిర్ణయం అయినా రాజధాని కమిటీ రిపోర్ట్ రావాలని, దాని పై చర్చ జరగాలాని, అప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటాం అని, అయితే జగన్ మోహన్ రెడ్డి గారు, మూడు రాజధానులు ఉండొచ్చు ఏమో అంటే, దానికి ఇన్ని అర్ధాలు తీస్తున్నారు అంటూ మీడియా పై ఫైర్ అయ్యారు. మీ మీడియాకు జగన్ పై ఎంత ద్వేషం ఉందొ తెలుస్తుందని అన్నారు.
పేర్ని నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఎంత మందికి భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎంత మంది వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటూ, రైతులు పై విమర్శలు గుప్పించారు. ఒకరో ఇద్దరో ఇన్స్టంట్ రియాక్షన్ చూపిస్తారని, అది సహజం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోతుంది అనే ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు రిపోర్ట్ రాకుండా, ఈ హడావిడి ఎందుకు అంటూ ప్రశ్నించారు. అమరావతి పై చర్చ జరిగితే తమ బండారం బయట పడుతుందని, తెలుగుదేశం పార్టీ భయమని అన్నారు. మూడు రాజధానులు ఉండొచ్చు అనే జగన్ అన్నారని, ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదని అన్నారు.