ఇప్పటికే చిత్ర విచిత్ర పన్నులతో ప్రజలను బాదేస్తున్న జగన్ ప్రభుత్వం, తాజాగా మరో బాదుడుకి సిద్ధం అయ్యింది. ఏపీలో వాహనదారులపై ప్రభుత్వం మరో బాదుడుకి సిద్ధం అయ్యింది. ఏపీలో ఇకపై పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వేయనున్నారు. రవాణా వాహనాలకు ఏడేళ్లు దాటితే ఏటా రూ. 4వేలు కట్టాల్సి ఉంటుంది. అదే పదేళ్లు దాటితే ఏడాదికి రూ. 5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, 12 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.6 వేలు గ్రీన్ ట్యాక్స్కట్టాలి అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మోటారు సైకిళ్లు 15 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.2 వేలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అలాగే 20 ఏళ్లు దాటితే ఏడాదికి రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, కార్లు, జీపులు వగైరా వాటికి 15 ఏళ్లు దాటితే రూ.5 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. 20 ఏళ్లు దాటిన కార్లు, జీపులకు రూ.10 వేలు గ్రీన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక కొత్త వాహనాలు రూ.50 వేలు పైబడిన బైక్‌లపై 9 నుంచి 13 శాతం పన్ను పెంచారు. రూ.20 లక్షలకు మించిన వాహనాలపై 12 నుంచి 18 శాతం పన్ను పెంచారు. ఇవ్వాల్టి రోజున బండి లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఈ పెంపు అందరి మీద గట్టిగానే పడననుంది.
ఏపి ప్రజలకు మరో షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. మరో బాదుడికి రంగం సిద్ధం...
Advertisements