మొన్నటి వరకు చంద్రబాబు తాగే మినరల్ వాటర్ పై కూడా గోల గోల చేసి, మేము ప్రజలను ఇబ్బంది పెట్టం, మేము అసలు ఖర్చు చెయ్యం అంటూ వైసీపీ నేతల ప్రసంగాలు చూసాం. ట్రాఫిక్ కి ఇబ్బంది అని చెప్పి, చంద్రబాబు ఉండవల్లి నుంచి గన్నవరం వరకు హెలికాప్టర్ వాడితే, ఖర్చు ఖర్చు అంటూ గోల చేసారు. అదే హెలికాప్టర్ కాకుండా వెళ్తే, చంద్రబాబు వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అంటూ రాజకీయం చేసారు. అయితే, ఇప్పడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేస్తాను అంటూ చెప్తున్న జగన్, తన కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ఎగరటానికి, 42 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన రాకపోకల కోసం, కృష్ణాకెనాల్‌ రైల్వే జంక్షన్‌ సమీపంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసారు. దానికి నిన్న ట్రయిల్‌రన్‌ జరిగింది.

హెలీప్యాడ్‌ నుంచి బయటకు వచ్చే జగన్ కాన్వాయ్ కి డివైడర్‌ అడ్డుగా మారింది. దీన్ని వెంటనే తొలగించాలని జగన్ భద్రతా సిబ్బంది మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. అంతే కాకుండా జగన్ నివాసం నుంచి పడమర వైపు బయటకు వచ్చే మార్గంలో అడ్డుగా ఉన్న మూడు ఇళ్లను తొలగించాలని కడు ఆదేశాలు వెళ్ళాయి. వెంటనే రన్గమ్లొఇ దిగిన అధికారులు ఆ ఇళ్ళ యజమానులతో చర్చిస్తున్నారు. ఈ మూడు ఇల్లు కాకుండా, హెలీప్యాడ్‌ ఉన్న ప్రాంగణ ప్రాంతంలో 42 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని కూడా వెంటనే అక్కడ నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. హెలిప్యాడ్ ప్రారంభం అయ్యే లోపు, అత్యవసరంగా 12 ఇళ్లను తొలగించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ ఇంటి యజమానులుతో మాట్లాడి, వారిని అక్కడ నుంచి వేరే చోటుకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సియం హెలికాప్టర్ ఎగరటం కోసం, ఏళ్ళుగా అక్కడ ఉంటున్న 42 కుటుంబాలను అక్కడ నుంచి పంపించటం దారుణం అని స్థానిక టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read