జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, క-రో-నా విషయంలో ప్రధాని మోడీ వైఖరిని విమర్శిస్తూ ట్వీట్ చేయటం, ఆ వెంటనే బీజేపీ అధికార ప్రతినిధి లాగా, జగన్ మోహన్ రెడ్డికి కోపం వచ్చి, హేమంత్ సోరెన్ ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ, మోడీని వెనకేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ పై, హేమంత్ సోరెన్ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు బదులు ఇస్తూ, మీ వ్యవహార శైలి అందరికీ తెలుసు, మీరు క్షేమంగా ఉండాలి అంటూ జార్ఖండ్ ముక్తి మోర్చా, వెటకారంగా జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు బదులు ఇవ్వటం జరిగింది. మీ నిస్సహయత గురించి అందరికీ తెలుసు జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లోనే, ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ వాయిదా పడింది అంటూ వచ్చిన వార్త కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా జత పరిచింది. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై మే7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు కోరగా, జగన్ మోహన్ రెడ్డి తరుపు న్యాయవాదులు తమకు ఇంకా సమయం కావాలి అని కోరటంతో, ఒక వార్తా ప్రచురితం అయ్యింది. ఆ వార్తని జత పరుస్తూ, జగన్ మోహన్ రెడ్డి మీ నిస్సహాయత అందరికీ తెలిసిందే, మీరు క్షేమంగా ఉండండి అంటూ ట్వీట్ చేసారు.
అయితే ఈ విషయంలో మాత్రం హేమంత్ సోరెన్ సంస్కారాన్ని మెచ్చుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తనకు సంబంధం లేని విషయంలో తల దూర్చిన జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ కు, హేమంత్ సోరన్ ఘాటుగా బదులు ఇస్తారని, ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తుందని అందరూ ఊహించారు. అయితే హేమంత్ సోరెన్ ఎక్కడా బదులు ఇవ్వకుండా, తన పార్టీ నేతల చేతే బదులు ఇప్పించి, ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు కాకుండా చూసుకున్నారు. హేమంత్ సోరెన్, తన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని ఆయన బాధలో ఆయన ఉంటే, ఇతర ఏ రాష్ట్రాల్లో, చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు కూడా లేని బాధ, జగన్ మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు. ఒక పక్క జగన మోహన్ రెడ్డి వైఖరి పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. అసలు జగన్ మోహన్ రెడ్డి, ఈ విషయంలో ఎందుకు స్పందించారో, ఎవరికీ అర్ధం కాలేదు.