ఒకే రోజు మన రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం మూడు కేసుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా దున్నపోతు మీద వాన కురిసినట్టు వైసీపీ సర్కారు నుంచి స్పందన శూన్యం. దీనిపై ట్విట్టర్ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఘాటుగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభిశంసించినట్టే. సిగ్గు ఉన్న ప్రభుత్వం అయితే ఉరేసుకుని చచ్చేది అంటూ సీబీఎన్ ట్వీట్ చేశారు. కాంట్రాక్టర్లు బిల్లులు అందక దొంగలుగా మారారు. బిల్లులు చెల్లించడంలేదని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కాంట్రాక్టర్లను దొంగలు చేశారని, పెన్షనర్లకు పింఛను సొమ్ములు చెల్లించక పిక్ పాకెట్ గాళ్లను చేస్తారా అంటూ హైకోర్టు సర్కారుపై మండిపడింది. గ్రానైట్ పరిశ్రమకి పవర్ కట్ చేసిన కేసులోనూ హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. బిల్లు కట్టలేదని పరిశ్రమ పవర్ కట్ చేసిన సర్కారు ఎవ్వరికీ బిల్లులు చెల్లించడంలేదని, వీరి పవర్ ఎవరు కట్ చేయాలని ప్రశ్నించింది. ఎస్సీల నిధులు మళ్లింపుని తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఒకే రోజు మూడు వ్యాజ్యాలపైనా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సర్కారు నిర్లక్ష్య తీరుకి అద్దం పడుతున్నాయని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
జగన్ ప్రభుత్వానికి హైకోర్ట్ భారీ షాక్... ఒకే రోజు మూడు మొట్టికాయలు...
Advertisements