జగన్ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయశాఖ కార్యదర్శిని ప్రభుత్వం నియమించిన తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. న్యాయాధికారిగా ఉండే వ్యక్తి మాత్రమే న్యాయశాఖ కార్యదర్శిగా ఉండాలని నిబంధనలు ఉన్నా, న్యాయాధికారిగా లేని వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారు అంటూ, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి నియామకం తాము ఎప్పుడూ చూడలేదని, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఇలా జరిగిందా అని, అడ్వొకేట్ జనరల్ శ్రీరాంను హైకోర్టు ప్రశ్నించింది. దీని పైన మీరు పరిశీలిన జరిపి, కోర్టుకు అవగాహన కలిపిస్తే, తెలుసుకుంటాం అంటూ, అడ్వొకేట్ జనరల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. న్యాయశాఖ కార్యదర్శిని ఎలా నియమిస్తారు, అర్హతలు ఏమిటి ? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏ నిబంధన ప్రకారం, ఈ నియామకం చేసింది అంటూ ప్రభుత్వాన్ని చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం జరిగిన కేసు విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శిని నియమించిన తీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read