ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం పై, గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి. ప్రత్యేక హోదాని కేంద్రం మెడలు వంచి సాధిస్తామని, జగన్ మోహన్ రెడ్డి ఊరు ఊరు తిరిగి చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యెక హోదా వస్తే ఉద్యోగాల విప్లవం వస్తుందని, ఇన్కం టాక్స్ కట్టే అవసరం లేదని, అలాగే ప్రతి జిల్లాని ఒక హైదరాబాద్ లాగా తయారు చేస్తామని, యువతకు వద్దంటే ఉద్యోగాలు వస్తాయి అంటూ, హోరెత్తించారు. ఇవన్నీ నమ్మిన ప్రజలు, జగన్ మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. ఇక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చేస్తారని అందరూ భావించారు. మొదట్లో కదా అనుకున్నారు, ఏడాది అయ్యింది, రెండేళ్ళు అయ్యిందా, హోదా అనే మాటే నోట్లో నుంచి రావాటం లేదు. అయితే ఎట్టకేలక మొదటి సారి ప్రత్యేక హోదా పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ప్రత్యేక హోదా ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కేంద్రాన్ని అడుగుతూ ఉండటం తప్ప మనం చేసేది ఏమి లేదని అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, అందుకే కేంద్రాన్ని అడగటం మినహా ఏమి చేయలేని పరిస్థితి ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన పని వల్లే ఇలా జరిగిందని, తాను అందకే గట్టిగా ఆడగలేక పోతున్నానని అన్నారు.

jagan 19062021 2

అయితే ఈ మాటలు విన్న ప్రజలు, యువత షాక్ కు గురయ్యారు. మెడలు వంచి సాధిస్తాను అని చెప్పిన జగన్ మోహన్ రెడ్దేనా ఇలా మాట్లాడుతుందని ఆశ్చర్య పోయారు. సంకీర్ణ ప్రభుత్వం లేకపోయినా, కేంద్రానికి రాజ్యసభలో బలం లేదు కదా, అక్కడ కేంద్రాన్ని గట్టిగా నిలదీసి, మీ బిల్లులు పాస్ అవ్వాలి అంటే, మేము చెప్పినట్టే ప్రత్యెక హోదా ఇవ్వండి, అని కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేవటం లేదని ప్రశ్నిస్తున్నారు. అంబానీ సన్నిహితులకు రాజ్యసభ ఇచ్చినప్పుడు, ఆ షరతు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం కేంద్రాన్ని ప్రశ్నించకుండా, ఇప్పుడు దేవుడి మీద భారం వేయటం, నేను ఏమి చేయలేను, సంకీర్ణ ప్రభుత్వం లేదు, చంద్రబాబు వల్లే ఇదంతా అని చెప్పటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ చూసి నిరుత్సాహంలో ఉన్న యువత, జగన్ వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యారు. పుదుచ్చేరిలో బీజేపీ హోదా ఇస్తాను అంటే, అక్కడకు తమ పార్టీ నేతలను జగన్ పంపించి ప్రచారం చేసిన విశయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read