ఆంధ్రర్పదేశ్ రాష్ట్రంలో వింత పరిస్థితి ఉంటుంది. తమకు ఏది కావలిస్తే అది, ఎటు కావలిస్తే అటు తిప్పేసే విధంగా అధికార వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుతో, వైసీపీ అధిష్టానం బాగానే ఉన్నా, అధిష్టానం మాటలు విని మీడియా ముందు చెలరేగిపోతున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అలాగే సోషల్ మీడియాలో రెచ్చిపోయే పేటీయం బ్యాచ్ కు మాత్రం షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి దాకా నిమ్మగడ్డ మా బొచ్చు పీకుతాడా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము రెడీ అని చెప్పిన మంత్రులు, ప్రతి రోజు బయటకు వచ్చి, ఇప్పుడు ఎన్నికలు ఏంటి అంటూ భయపడుతూ ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి. ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న వైసీపీ నేతలకు, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. మొన్నటి దాకా రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు, ఇప్పుడు దీన్ని ఎలా పాజిటివ్ గా మలుచుకోవాలి అనే పనిలో, మాట మార్చేసి, మడమ తిప్పేసే పనిలో ఉన్నారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే ఆరు సార్లు వాయిదా పడిన ఇళ్ళ పట్టాల పంపిణీని, డిసెంబర్ 25న క్రిస్మస్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటానికి రెడీ అవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇప్పటికే కొన్ని స్థలాల విషయంలో కోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్ భూములు, చెరువులు భూములు, స్మసానాలు, ఆవ భూములు, ప్రభుత్వ బడుల భూములు, ఇలా అనేక రకాల భూముల్లో ఇళ్ళ పట్టాలు ఇవ్వటం పై కొంత మంది కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.
అయితే దీని పై కోర్టు స్టే ఇచ్చింది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటూ, కోర్టు స్టే ఇచ్చిన భూములు తప్ప, మిగతా అన్ని భూములు పేదలకు పంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎన్నాళ్ళుగానో ఉన్న సమస్యకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది. అయితే ఈ నిర్ణయం పేదలకు సంతోషం కాగా, వైసిపీ శ్రేణులకు మాత్రం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. ఇన్నాళ్ళు ఇళ్ళ పట్టాల పంపిణీ, చంద్రబాబు కోర్టులో కేసులు వేసి ఆపేసారని ప్రచారం చేసామని, చాలా మంది ప్రజలు కూడా ఇదే నిజం అని నమ్మారని, అయితే తెలుగుదేశం పార్టీ నేతలు, మీది తప్పుడు ప్రచారం, కోర్టు స్టే ఇచ్చిన భూములు తప్ప, మిగతావి ఎందుకు పంచరు అని అడిగితే, ఆ రోజు ఎదురు దాడి చేసామని, ఈ రోజు ఏకంగా మా అధినాయకుడే, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టే, కోర్టు స్టే ఉన్న చోట కాకుండా, మిగతా చోట్ల ఇవ్వాలని చెప్పటంతో, తెలుగుదేశం మాటలు నిజం అయ్యాయని, తాము చేసిన ప్రచారం తప్పు అని ప్రజలు అనుకుంటున్నారు అంటూ, వైసీపీ శ్రేణులు షాక్ కు లోనయ్యాయి. ఒక అబద్ధాన్ని ఎల్ల కాలం నిజం చేయలమని, ఇప్పటికైనా రాజకీయ నాయకులు అర్ధం చేసుకుంటే మంచిది.