పులివెందులను సస్యశ్యామలం చేసే బాధ్యత నాది. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకుంటాం. గండికోటలో 20టీఎంసీల నీటిని నిల్వ చేసి సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పులివెందుల పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పులివెందులకు వచ్చినప్పుడు మీరు చూపిన అభిమానం మరువలేనిది. ఈ ప్రభుత్వంలో మీరు ఆనందంగా ఉన్నారా లేదా. ఈ రోజు బాగా ఆలస్యమైంది. కానీ మీ ఆనందం, ఉత్సాహం చూస్తోంటే పులివెందుల్లోనే ఉండాలనిపిస్తోంది. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉండడంతో కష్టంగానే వెళ్తున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘పులివెందులలోని మీరందరూ ఆనందంగా ఉన్నారా తమ్ముళ్లూ... ఈరోజు పులివెందులలో ఒక చరిత్ర. పులివెందుల జనం చూపిన అభిమానం చరిత్రలో మరచిపోలేనిది. నేనడుగుతున్నా ఈ ప్రభుత్వం వలన లాభపడ్డారా, మీరేమంటారు తమ్ముళ్లూ.. ఆనందంగా ఉన్నామనే వారు చేతులెత్తండి’’ అనడంతో విచ్చేసిన ప్రజలందరు చేతులెత్తి హర్షధ్వానాలను వ్యక్తం చేశారు.

game 27032019

పులివెందులను సస్యశ్యామలం చేసి నెంబర్‌ 1 గా చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘ఒకప్పుడు పులివెందులకు నీళ్లు వచ్చేవి కావు. రూ.1200కోట్లు ఖర్చుపెట్టాం, నీళ్లు తీసుకొచ్చాం, నదుల అనుసంధానంతో శ్రీశైలం నీటిని గండికోటకు తీసుకొచ్చి పులివెందులకు పారించాం. నదుల అనుసంధానం ద్వారా రాళ్లసీమను రతనాల సీమగా మారుస్తాం. సింహాద్రిపురం, లింగాల మండలాల్లోని చీనీతోటలు, అరటి తోటలను అభివృద్ధి చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు అన్నివిధాల అమలు చేస్తాం. చంద్రన్న బీమాను రూ.5లక్షల నుంచి రూ.10లక్షలు, పెళ్లి కానుక రూ.లక్ష వరకు ఖర్చుపెడతాం. వైద్య ఖర్చులకు రూ.5లక్షల వరకు అందించి ప్రైవేట్‌గా ఉన్న మెడికల్‌ షాపుల్లో మందుల కొనుగోలుకు అవకాశం ఇస్తాం. సతీ్‌షరెడ్డి గడ్డం దీక్ష చేపట్టి నీళ్లు పులివెందులకు పారించారు.

 

game 27032019

సతీషరెడ్డిని గెలిపించుకుంటే గండికోటకు 20టీఎంసీల నీరు తీసుకొస్తాం. ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని గెలిపిస్తే పులివెందులలోని ప్రతి ఎకరాను పండించి ఆ పంటలకు ప్రపంచ వ్యాప్తంగా గిట్టుబాటు ధర కల్పిస్తాం. నీళ్లు ఉంటే రైతన్నలు బంగారు పండిస్తారు. ఈ గడ్డపై ఉన్న జగన్‌ మీకేం చేశారో ఓసారి ఆలోచించండి. జగన్‌ లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ సొంత గడ్డపై సోమవారం టీడీపీ నేతలు నిర్వహించిన ఎన్నికల సభ విజయవంతమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు విచ్చేస్తారని ప్రకటించినా ఆయన 5 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో రోడ్‌షో నిర్వహిస్తూ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వాహనంపై నుంచే ప్రసంగించారు. 40 నిమిషాల పాటు సాగిన సీఎం ప్రసంగంలో స్థానిక అంశాలు ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో సీఎం కూడా మీ ఆనందం ఉత్సాహం చూస్తుంటే పులివెందుల్లోనే ఉండాలనిపిస్తోందని చమత్కరించారు. ఎన్నికల సభకు భారీగా జనం తరలిరావడంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read