సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుని నారా లోకేష్ భలే ట్రాప్ చేశారని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. యువగళం పాదయాత్రని హైలైట్ చేసే బాధ్యతని వైసీపీ తీసుకున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అనుమతుల మంజూరులో నాన్చి నాన్చి ఇవ్వడంతోనే లోకేష్ పాదయాత్రకి వైసీపీ పబ్లిసిటీ ఆరంభమైంది. పాదయాత్రలో పోలీసుల హడావిడితో యువగళం పాదయాత్ర రోజూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి కుప్పంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి, పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి వంటి వారు చేస్తున్న ఓవర్ యాక్షన్ తో యువగళం కళకళలాడుతోంది. ఓ వైపు యువగళానికి జనం లేరంటూ వైసీపీ సోషల్మీడియా ప్రత్యేక టీము ద్వారా పాదయాత్ర లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాయి. ఇంకో వైపు ఇంటిలిజెన్స్ వాళ్లు డ్రోన్లు, లైవ్ ఎక్విప్మెంట్ ద్వారా పాదయాత్రలో ప్రతీ క్షణాన్ని రికార్డు చేసి తాడేపల్లి పెద్దలకు రియల్ టైములో పంపుతున్నారు. ఇంటిలిజెన్స్, వైసీపీ సోషల్మీడియా టీములు, వారిని కాపాడేందుకు మఫ్టీ పోలీసులు, అధికారికంగా బందోబస్తులో పాల్గొనే పోలీసులతో పాదయాత్రకి పెద్దగా జనసమీకరణ చేయాల్సిన అవసరం రావడంలేదు. మఫ్టీలో ఉన్నోళ్లు, యూనిఫాం వేసిన వీళ్లంతా కలిసి 200 మంది పైనే పాదయాత్రని రెండు వారాలుగా ఫాలో అవుతున్నారు. లోకేష్ తప్పు మాట్లాడారని ఖండించడానికి ఒకరు, జగన్ ని దూషించారని కౌంటర్ ఇవ్వడానికి మరొకరు, నిబంధనలు ఉల్లంఘించారని చెప్పేందుకు ఇంకొకరు లెక్కన రోజూ వైసీపీ నుంచి ప్రెస్మీట్లు, ప్రకటనలు, ట్వీట్లతో వస్తున్నారు. రోజూ జగన్ భజనలో తరించే వైసీపీ అఫీషియల్ సోషల్మీడియా ఖాతాలన్నీ లోకేష్‌ని ట్రోల్ చేయడానికి, పాదయాత్రలో జనం లేరు అని చెప్పడానికి వాడుతున్నారు. దీంతో వైసీపీ సోషల్మీడియా ఖాతాల్లో టిడిపి ఎస్ఎం కంటే ఎక్కువగా లోకేష్‌కి ప్రచారం దక్కుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోకేష్ పాదయాత్రని అస్సలు పట్టించుకోకుండా ఉండి ఉంటే, ఇంత హైలైట్ అయ్యేది కాదు. నారా లోకేష్ తెలివిగా వ్యవహరిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ట్రాప్‌లో పడేశారు. ఇప్పుడు ప్రభుత్వం, పోలీసులు, వైసీపీ, వైసీపీ సోషల్మీడియా మొత్తం నారా లోకేష్ నామస్మరణే. యువగళం పాదయాత్ర వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.
లోకేష్ ట్రాప్ లో పడిన జగన్... అధికారం ఉందని, ఏమి చేస్తున్నారో కూడా అర్ధం కావటం లేదు
Advertisements