అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకుని ప్రజలకు సేవ చేసే వాడే నాయకుడు... ఇలాంటి నాయకులనే ప్రజలు ఆదరించేది... ఇది వరకటిలా లేదు ఇప్పుడు రాజకీయం... ఇప్పుడు అంతా పోజిటివ్ మూడ్ లో ఉన్నారు ప్రజలు... తమకు అభివృద్ధి కావాలని, సంక్షేమం కావాలని, తమకు సేవ చేసే వారే నాయకులుగా అంగీకరిస్తున్నారు... అందుకే చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి అంటూ 11 రోజుల పాటు ప్రజల ముందుకు వెళ్తుంది... ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగి దాకా అందరూ ప్రజల ముందుకు వస్తున్నారు... ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అంటున్నారు... ప్రజలకు మరింత చెరువు అవుతుంది ప్రభుత్వం... మరి జగన్ పరిస్థితి ఏంటి ?
నిజానికి ఇది జగన్ కు ఒక చక్కటి అవకాశం... ఇది చంద్రబాబు ఇచ్చిన అవకాశం... నిజంగా జగన్ తెలివిగలవాడు అయితే, ఈ జన్మభూమి కార్యక్రమం ఉపయోగించుకుని, అటు ప్రజలకు దగ్గర కావచ్చు, ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చు... జగన్ పాదయాత్రలో ఎన్నో చిత్రాలు చూస్తున్నాం... ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల ఇలా ఏమి మాకు ఇవ్వట్లేదు అని ప్రజలు చెప్తున్నట్టు జగన్ ప్రచారం చేస్తున్నారు... అదే నిజం అయితే, ప్రతి ఊరిలో జగన్ తన అనుచరుల చేత, ఎవరికి ఏ సమస్య ఉన్నా, వారి ఊరిలో జరిగే జన్మభూమిలో ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం దరఖాస్తు పెట్టించాలి...
ఈ విధంగా, ఒక వేళ అవి ఆమోదిస్తే, మా చేత దరఖాస్తు పెట్టించి, పెన్షన్ వచ్చేలా చేసాడు అని ప్రజలు జగన్ ను నమ్ముతారు.. నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించాడు అని అభినందిస్తారు... ఒకవేళ ప్రభుత్వం ఇవి చెయ్యకపోతే, అదే దరఖాస్తు చేసిన ప్రజలను తీసుకువచ్చి, అర్హులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని ఆందోళన చెయ్యవచ్చు... ఈ విధంగా అటు ప్రభుత్వం పై పోరాటం చేసినట్టు ఉంటుంది, ఇటు మా తరుపున పోరాడుతున్నాడు అనే భావన ప్రజల్లో ఉంటుంది.... మరి చంద్రబాబు ఇచ్చిన ఈ అవకాశం, జగన్ ఉపయోగించుకుంటాడా ? జగన్ దగ్గర ఉన్న సలహాదారుడు ఇలాంటి సలహాలు ఇవ్వాలి కాని, ఎంత సేపు ఫేక్ ప్రచారంతో ప్రజలను మభ్యపెడతాము అంటే కుదరదు...