కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కి పిలుపు ఇచ్చాయి... ఈ పిలుపు ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు... కాని, జగన్ విచిత్ర పరిస్థితి వలన, పిలుపుకి బదులు, ఎవరో పిలుపిచ్చిన బంద్ కు మద్దతు ఇస్తున్నారు... అయితే, జగన్ మోహన్ రెడ్డి, ఈ బంద్ కోసమని, ఇవాళ కూడా పాదయాత్రకి సెలవు ఇచ్చారు... అందరు బంద్ లో పాల్గునాలని పిలుపు ఇచ్చారు... దీంతో, జగన్ కూడా బంద్ లో పాల్గుంటారని అందరూ అనుకున్నారు...
సెలవు ఇచ్చి మరీ, జగన్ బంద్ లో ఇరగదీస్తారని రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది... అయితే జగన్ మాత్రం తన మీద నమ్మకం పెట్టుకుంటే ఏమవుతుందో, మరోసారి చూపించారు... బంద్ వలన పాదయాత్రకు సెలవు అని చెప్పి, లోటస్ పాండ్ పారిపోయారు... మడమ తిప్పని మహా వీరుడు ఇలా చేస్తాడు అని ఊహించని వైసిపీ నాయకులు పాదయాత్ర శిబిరం నుంచి నెమ్మదిగా జారుకున్నారు... కడుపు చించుకుంటే కాలు మీద పడుతుని, మీడియా వచ్చే లోపే పోదాం అంటూ, ఎవరికి వారు వెళ్ళిపోయారు...
అంతకు ముందు జనాలు నిద్ర లేవక ముందే బస్సులు పంపి తెప్పించుకున్న కాలేజీ పిల్లల్ని పెట్టుకొని ఫోటో లకు ఫోజ్ లు ఇచ్చి, 7:50 కల్లా సిబరం నుంచి హైదరాబాద్ బయలుదేరాడు ఘనమైన ప్రతిపక్ష నాయకుడు... రేపు శుక్రవారం ఎలాగు కోర్ట్ కి పోవాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాం అనుకుని, లోటస్ పాండ్ కి వెళ్ళిపోయారు.. సామాన్య ప్రజలు రోడ్డు మీద ఉంటే, ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు, తుర్రు మంటూ పారిపోయాడు... ఒక పక్క, పార్లమెంట్ ఉభయ సభల్లో, వైసిపీ ఎంపీలు పారిపోతుంటే, ఫీల్డ్ లో ఉన్న జగన్ కూడా అలాగే పారిపోతున్నాడు...