కడప అంటే వైఎస్ ఫ్యామిలీ అనే దగ్గర నుంచి, జగన్ చేస్తున్న విధానాలతో, కడప కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేక జగన్ చతికిల పడ్డాడు. మరో వైపు చంద్రబాబు పోజిటివ్ క్యంపైన్ తో, నీళ్ళు ఇస్తూ, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ, ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో, కడప జిల్లాలో తన పట్టు నిలపెట్టుకోవాలని వైసిపి అధినేత జగన్ భావిస్తున్నారు. కడప జిల్లాలో ‘నవరత్నాల’ అస్త్రంతో మళ్లీ వైసీపీ గడప గడపకూ ప్రచారానికి శ్రీకారం చుడుతోంది.
ఈ నెల 17 నుంచి కార్యక్రమం మొదలు కానుంది. నవరత్నాల పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి రోజుకు రెండు బూత్‌లలో పర్యటించేలా కార్యాచరణను రూపొందించుకున్నారు. ఎన్నికల కోసమే తాము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని వైసీపీ నేతలు చెపుతున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగానే జగన్ నవంబరులో మళ్ళి కడప జిల్లాలో పర్యటిస్తారని, వారు చెపుతున్నారు. కాగా ఐదు నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర జరిగే అవకాశాలు ఉన్నాయని, మిగత నియిజక వర్గాల్లో జగన్ బస్సు యాత్ర ఉండే అవకాశం ఉంది.
పార్టీ అధినేత జగన్ ఈ కార్యకమ్రం పెద్ద ఎత్తున చేపట్టాలని కేడరును కోరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లోకి తీసుకె ళ్లాలి. అయితే పార్టీ నేతలలో మాత్రం వాదనలు దీనికి భిన్నంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడు నెలలు పైనే ఉన్నాయి . ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే కేడరు, కార్యకర్తలను నడపడం పార్టీ నేతలకు చాలా భారమని వారు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఖర్చు తలుచుకుంటేనే భయమేస్తున్న నేపధ్యంలో నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లడం, అదనంగా ఈ భారాన్ని కూడా మోయాల్సి రావడం, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క చంద్రబాబు పోజిటివ్ క్యంపైన్ తో ప్రజలను ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. మొత్తమ్మీద గడప గడపకూ వైసీపీ నవరత్నాలు కార్యక్రమం నేతలకు అగ్నిపరీక్షగా మారనుంది.