రూ.149.05 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గమని నిన్న సాక్షి పత్రికలో కథనం రాశారని, కృష్ణానది కుడి కరకట్టపై 15.5 కిలో మీటర్ల వరకు రహదారి విస్తరణ పనులకు, ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేస్తున్నాడని కూడా రాశారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "విజయవాడ నుంచి అమరావతికి కనెక్టివిటీ పెంచడానికే కరకట్ట విస్తరణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. నిన్న జరిగింది చూశాక, ముఖ్యమంత్రికి ఉన్నట్టుండి అమరావతిపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్య పోయింది. రాజధాని అమరావతిని శ్మశానమని, ఎడారని, ముంపునకు గురయ్యే ప్రాంతమని చెప్పిన వ్యక్తే, నేడు అకస్మాత్తుగా ఎందుకిలా చేశాడా అనే ప్రశ్నకు సమాధానం దొరక్క ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏ పనిచేసినా ఏదో ఒక స్వలాభంతోనే చేస్తాడు. కరకట్ట రోడ్డు నిర్మాణం వెనుక కూడా అలాంటి కారణాలే ఉన్నాయి. గత 10, 15రోజులుగా అనేక రకాల వార్తలు వింటున్నాం. ఇసుక నిల్వతో కరకట్టకు ముప్పని, తాళాయపాలెంలో ఇసుక డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై రైతుల అభ్యంతరం వంటివి వింటున్నాం. కృష్ణా నదిలోని ఇసుకను డ్రెడ్జింగ్ సాయంతో తోడేసి, కరకట్ట పక్కనే పెద్దపెద్ద డంపింగ్ యార్డులు ఏర్పాటుచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. డంపింగ్ యార్డు నుంచి ఇసుకను తరలించడానికే ఈ ముఖ్యమంత్రి రోడ్డు విస్తరణకు పూనుకున్నాడు. పెద్ద ఎత్తున ఇసుకరవాణా జరగాలంటే మంచిరోడ్డు కావాలి కదా. దానికోసమే 4 వరుసలతో కరకట్ట రహదారి విస్తరణకు ముఖ్యమంత్రి పూనుకున్నాడు. అదీ అసలువిషయం. ప్రపంచమంతా ఎదరుచూస్తున్న ప్రశ్నకు సమాధానం అదీ. అదొక ప్రధానకారణమైతే, రెండో ముఖ్యమైన కారణం ఇంకోటి ఉంది. రాజధాని అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం కోసం చంద్రబాబునాయుడు గతంలో స్టార్టప్ ఏరియాను తయారుచేశారు. రైతులుపెద్దమనసు చేసుకో బట్టే, లక్షలకోట్ల విలువైన సంపద సృష్టికి అమరావతి కేంద్ర బిందువైందని చంద్రబాబు అనేక సార్లు చెప్పారు. అలా ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే స్టార్టప్ ఏరియా. 680హెక్టార్లు (1689ఎకరాలు) భూమితో రివర్ ఫ్రంట్ వ్యూ (నదీముఖంగా) ఉన్న స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావించారు. ఆ భూమి మొత్తాన్ని కాజేయడానికే, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రోడ్డు విస్తరణకు సిద్ధమయ్యాడు.
స్టార్టప్ ఏరియాకు రోడ్డువేస్తే మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. రోడ్డు వేయడం వల్ల, బిల్డ్ ఏపీ పథకం కింద, 1689 ఎకరాలను అమ్మకానికి పెట్టి, తన బినామీలతో ఆ భూమిని కొనిపించాలన్నదే ముఖ్యమంత్రి దురాలోచన. ఎకరం రూ.10కోట్లు వేసుకున్నా కూడా ఆభూమి మొత్తంవిలువ రూ.17వేలకోట్ల వరకుఉంటుంది. రూ.17వేలకోట్ల ఆస్తిని కాజేయడానికే ఈ ముఖ్యమంత్రి కరకట్ట రోడ్డు విస్తరణకు సిద్ధమయ్యాడు. ముఖ్యమంత్రి చేపట్టిన రోడ్డువిస్తరణ వెనుక రూ.17వేలకోట్ల స్కామ్ ఉంది. అమరావతిపై ఈ ముఖ్యమంత్రికి నిజంగా ప్రేమఉంటే, చంద్రబాబునాయుడు గతంలో 90శాతం వరకు పూర్తిచేసిన సీడ్ యాక్సెస్ రోడ్డుని ఎందుకు పూర్తిచేయడంలేదు? కరకట్టను ఆనుకునే వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నేత లభూములున్నాయి. రామకృష్ణారెడ్డి అనుచరులుగా చెప్పుకునే కొందరు రాజధానికి భూములివ్వకుండా కోర్టులకు వెళ్లారు. అలా ఉన్నభూముల విలువను పెంచుకో వడానికి కూడా ముఖ్యమంత్రి వేస్తున్న రాజమార్గం సహకరిస్తుంది. కాబట్టి ఆరకంగా తన పార్టీ నేతలకు మేలు చేయడాని కే ముఖ్యమంత్రి రోడ్డు వేయడానికి సిద్ధమయ్యాడు. ఇవన్నీ ఇలాఉంటే, మరో ప్రధానకారణం ఏమిటంటే ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు సచివాలయానికి వెళ్లాలన్నా, ముసుగు వీరుడిలా ముసుగేసుకొని, పోలీసులసాయంతో వెళ్తున్నాడు. అలా వెళ్లడంఇబ్బందేకదా? అందుకే ఆ గ్రామాల మధ్య నుంచి వెళ్లకుండ కొత్త రోడ్డు వేయాలని భావించాడు. ఆగ్రామాల్లోనుంచి వెళ్లినప్పుడల్లా ఎన్నికలకు ముందు ఆయనచెప్పిన మాయమాటలు, మోసపు వాగ్ధానాలు గుర్తొస్తుంటాయి కదా. అందుకే ఇప్పుడు ఇలా రోడ్డునిర్మాణం పేరుతో, ప్రజల నుంచి తప్పించు కోవడానికి దొడ్డిదారి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇదండీ ముఖ్యమంత్రి చేపట్టిన కరకట్ట రోడ్డువిస్తరణ వెనకున్న దోపిడీ చరిత్ర.