కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో, లాస్ట్ మినిట్ ఎపిసోడ్ లు నడుస్తున్నాయి... ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి అనేక బాధ్యతలు అప్పగించిన, అమిత్ షా, చివరి నిమిషంలో చేసే పనుల బాధ్యత కూడా జగన్ మోహన్ రెడ్డికి అప్పగించారు.. దీనికి సంబంధించి, కొద్ది సేపటి క్రితం, జగన్ కు అమిత్ షా ఫోన్ చేసినట్టు వైసిపీ వర్గాలు చెప్పాయి.. రాజకీయ విషయాలు మాట్లాడుకున్నారు అని పైకి చెప్తున్నా, కర్ణాటకలో చేయివలసిన కొన్ని పనుల గురించి, జగన్ సహాయం కోసం, అమిత్ షా ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.. ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గాలి జనార్దన్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ లో వైస్ జగన్ మొత్తం బీజేపీ అభ్యర్థుల కు కావలిసిన ఎన్నికల ఖర్చు చేసే విదంగా అమిత్ షా తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే..
అయితే, ఇప్పుడు ఎన్నికల వేళ చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు చేసే పనులు కూడా, జగన్ వర్గానికి అప్పచెప్పారు... ఈ పనులు చెయ్యటంలో, జగన్ పార్టీకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందని, అందుకే వారిని ఉపయోగించుకుంటున్నారు అని తెలుస్తుంది... ఇప్పటికే వైసిపీకి చెందిన కొంత మంది బెంగుళూరులో ఉంటున్నారు.. వారితో పాటు, ఇక్కడ నుంచి కొంత మందిని అక్కడకు పంపించారు.. అయితే, ఎన్నికల వేళ, బయట మనుషులు అక్కడ ఉండటానికి అవకాసం లేదు.. అయినా సరే, అక్కడ కొంత మ్యానేజ్ చేసి, ఇక్కడ నుంచి వెళ్ళిన వారిని, అక్కడే ఉంచి, చివరి నిమిషంలో చెయ్యవలసిన కార్యక్రమాలు చెయ్యనున్నారు..
అయితే ఈ పనులు అన్నీ జగనే స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం... ఎలాగూ శుక్రవారం జగన్ కోర్ట్ కి పోవాలి.. దీని కోసమని చెప్పి, గురువారం ఉదయమే లోటస్ పాండ్ చెక్కేస్తాడు.. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపటి నుంచి, లోటస్ పాండ్ లో కూర్చుని, ఈ పనులు పర్యవేక్షణ చెయ్యనున్నారు... అలాగైనా అమిత్ షా ను ప్రసన్నం చేసుకోవటానికి, ఈ కార్యక్రమం ఎలాగైనా సక్సెస్ అవ్వాలని, జగన్ భావిస్తున్నారు... ఇప్పటికే విజయసాయి రెడ్డి, కొన్ని రోజుల క్రితం బెంగుళూరులో ఉండి, అన్నీ సెట్ చేసి వచ్చారనే వార్తలు వచ్చాయి.. ఇప్పుడు అమిత్ షా ఫోన్ తో, జగనే స్వయంగా రంగంలోకి దిగారు.