నిన్న దేశంలో రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, ఒక రాష్ట్రం పై, కేంద్రం చేసే దండయాత్ర, రెండోది దేశంలోని 23 పార్టీలు అన్నీ కలిసి, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లి, ఈవీఎం ల పై ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా నిన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ ను అరెస్ట్ చేసేందుకు సిబిఐ రంగంలోకి దిగటం, మా పోలీసులనే వచ్చి అరెస్ట్ చేస్తారా, ఇది రాజకీయ కక్ష, రాష్ట్రాలను ఇలా ఇబ్బంది పెడతారా అంటూ, సిబిఐ అధికారులనే అరెస్ట్ చేసి, కేంద్రం చేస్తున్న పనులకు నిరసనగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ధర్నా చెయ్యటం జరిగింది. అయితే, ఈ విషయం పై పార్టీలకు అతీతంగా, అందరూ మమతకు మద్దతు తెలిపారు. రాష్ట్రాల పై , కేంద్రం చేస్తున్న దండయాత్రకు నిరసన తెలిపారు.

jagan 02502019

అయితే, ఓ వైపు యునైటెడ్ ఫ్రంట్ మరోవైపు ఫెడరల్ ఫ్రంట్... యునైటెడ్ ఫ్రంట్‌లో బీజేపీయేతర పార్టీలు ఉండగా.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో బీజేపీ కాంగ్రెస్‌యేతర పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పాటు అవుతోంది. మమతా బెనర్జీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్... మమతా బెనర్జీ సీబీఐల మధ్య జరుగుతున్న యుద్ధం పై ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు మమతా బెనర్జీకి బీజేపీయేతర పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తోన్న మమత వర్సెస్ సీబీఐ అంశం నుంచి టీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. ఒక పక్క ఫెడరల్ ఫ్రంట్ అంటూ, మోడీ ఫిడేల్ ఫ్రంట్ ని చేసి, కేసీఆర్ ఆడుతున్న నాటకం ఇలా బయట పడింది.

jagan 02502019

ఇక రెండోది, ఈవీఎం ల పై ఫిర్యాదు. నిన్న దేశంలోని 23 పార్టీలు, ఈవీఎం ల అవకతవకల పై, వాటిని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే అంశాల పై, ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసారు. ప్రజాస్వామ్యం పై ఈవీఎం లు ఎలాంటి ప్రభావం చూపుతుంది, వాటిని ఎలా హ్యాక్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల పై ఫిర్యాదు చేసారు. అయితే, నిన్న అదే సమయంలో ఢిల్లీలో ఉన్న జగన్, వీరితో కలవకపోగా, మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంలు చాలా బాగా పని చేస్తున్నాయని, వాటిని మార్చాల్సిన అవసరం లేదు అంటూ, మోడీ పాట పాడి, మోడీ భక్తుడిని అంటూ మరో సారి నిరుపించుకున్నారు. నిన్న జరిగిన ఈ రెండు విషయాలతో, కేసీఆర్, జగన్, ఇద్దరూ మోడీ ఏజెంట్లు అనే విషయం ప్రజలకు మరో సారి తెలిసిపోయింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read