రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు. మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డిని, కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ ఎలా తిట్టారో, వీడియోలు బోలెడు ఉన్నాయి. చివరకు మానుకోటలో జగన్ అడుగు పెట్టకుండా, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో తరిమి తరిమి కొట్టారు. అంత బద్ధ వ్యతిరేకులు, మొన్న ఎన్నికల్లో కలిసిపోయారు. చంద్రబాబుని ఓడించారు. అప్పటి నుంచి జగన్, కేసీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే వీరి ఇద్దరి సఖ్యతతో, రాష్ట్రానికి అయితే ఒరిగింది ఏమి లేదు. వ్యక్తిగతంగా ఏమి లబ్ది అనేది బయటకు తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. కేసీఆర్, బీజేపీని టార్గెట్ చేయటం ఇప్పుడు దేశ వ్యాప్త చర్చ అయ్యింది. ఇక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ, కేసీఆర్ ని మాత్రం నమ్మటానికి వీలు లేదు అనే వారు కూడా ఉన్నారు. అయితే బీజేపీ పైన యుద్ధం ప్రకటించిన కేసీఆర్, వరుస పెట్టి ఏపి పైన కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేయకపోయినా, ఏపి వంక పెట్టుకుని, అనాల్సినవి అన్నీ అనేస్తున్నారు. మాకు ఫుల్ గా కరెంటు ఉంది, పక్క రాష్ట్రంలో చీకట్లు ఉన్నాయని చెప్పి, జగన్ అసమర్ధతను హేళన చేసారు. తరువాత రోజు శ్రీకాకుళంలో మోటార్లకు మీటర్ల పై హేళన చేసారు.
అప్పు కోసం మోటార్లకు మీటర్లు పెట్టారని, అన్నారు. అయితే కేసీఆర్ అలా అన్నారో లేదో, కేసీఆర్ కు సపోర్ట్ గా ఉన్న మీడియా, అదే అందుకుని, ఇప్పుడు జగన్ పై వ్యతిరేఖ కధనాలు రాస్తుంది. ఇది జగన్ మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిణామమే. మొన్నటి వరకు పొగిడిన వారు, ఇప్పుడు నెమ్మదిగా తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. కేసిఆర్ అనుకూల మీడియాలో, మోటార్లకు మీటర్ల విషయంలో, జగన్ వ్యవహార శైలిని తప్పు బట్టారు. ఒక పక్క కేసీఆర్ భారం అయినా, రైతులకు ఉచిత విద్యుత్ కోసం, మోటార్లకు మీటర్లు వద్దు అంటుంటే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం కేవలం కొంత అప్పు కోసం అని, ఏకంగా రైతులకు ఉరి వేసే విధంగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, జగన్ పై విమర్శలు గుప్పిస్తూ కధనాలు రాసారు. మోడీకి జగన్ లొంగిపోయారని రాసుకొచ్చారు. ఒక పక్క కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణా రైతులు సంతోషంగా ఉంటే, ఏపిలో రైతులు మాత్రం, జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని రాసారు. మరి కేసీఆర్ మీడియా రాతల పై, జగన్ మీడియా ఏమి సమాధానం చెప్తుందో చూడాలి మరి.