జ‌గ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి వేల‌కోట్లు ఖ‌ర్చు చేశారు. వ్య‌వ‌స్థ‌ల‌ని మేనేజ్ చేశారు. దీనికి ప్ర‌తిఫ‌లంగా తెలంగాణ సీఎం ఏం కోరుకుంటే ఏపీ సీఎం అది చేసి పెడుతూ వ‌చ్చారు. ఇద్ద‌రి మ‌ధ్యా విడ‌దీయ‌రాని ఆర్థిక‌, సంబంధాలు పెన‌వేసుకుపోయాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఏపీలో ప్ర‌జావ్య‌తిరేక‌త తీవ్రం కావడంతో ఎవ‌రికి వారే త‌మ‌ని తాము కాపాడుకుని అధికారం నిల‌బెట్టుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కి ఏపీలో అడుగు పెట్టేందుకు ఒక ఊతం కావాలి. అదే విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశం. అటు బీజేపీని ఎదిరించేలా, ఇటు ఏపీలో త‌మ పార్టీని విస్త‌రించే ప్ర‌ణాళిక‌లా కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. విశాఖ  స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా అడ్డుకుంటామ‌ని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ ప్ర‌క‌టించారు. విశాఖలో త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తామ‌ని, ఈ  బహిరంగ సభకు తెలంగాణ‌ సీఎం కేసీఆర్ హాజరవుతారు తోట చంద్రశేఖర్ వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప‌రం కాకుండా ప‌క్క‌రాష్ట్ర‌మైన తెలంగాణ ఏకంగా కేంద్రంతో ఢీకొట్ట‌డానికి రెడీ అవుతుంటే...ఏపీ స‌ర్కారు మాత్రం చేష్టలుడిగి చూస్తోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. త‌మ మిత్రుడైన కేసీఆర్ త‌న మ‌నుగ‌డ కోసం విశాఖ   స్టీల్‌ప్లాంట్ విష‌యంలో త‌మ‌ని ఇర‌కాటంలో పెట్టేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ల‌బోదిబోమంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read