రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, 2019 వరకు కేసీఆర్ బ్యాచ్ చిమ్మే విషంతో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా రాజధాని లేని ప్రాంతంగా ఉంటూ, హైదరాబాద్ లోనే కొన్ని రోజులు ఉన్న పరిస్థితిలో అనేక అవమానాలు పొందం. సరే మన ఇవన్నీ ఎందుకు, మన బ్రతుకు మనం బ్రదుకుదాం అని, చంద్రబాబు అమరావతి నిర్మాణం మొదలు పెట్టారు. అయినా మన ప్రాంతాన్ని టార్గెట్ చేయటం ఆపలేదు. చీటికి మాటికీ ఏదో ఒక గొడవ. చివరకు జగన్ తో కలిసి చంద్రబాబుని దింపే దాకా వ్యవహారం వెళ్ళింది. ఎన్నికల్లో వీళ్ళు అందరూ వ్యూహం పన్నినట్టే చంద్రబాబు ఓడిపోయారు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చంద్రబాబుకు పోయేది ఏమి లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నష్టం అని అనేక మంది అప్పట్లో చెప్పారు కూడా. కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, మన ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ లను కూడా, తెలంగాణా భూభాగం నుంచి తీసుకుని వెళ్తాం అని చెప్పే దాకా వెళ్ళింది. అప్పట్లో చంద్రబాబు హెచ్చించినా, కేసీఆర్ ఎంతో గొప్పవారు అని జగన్ మోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తుతూ ఏకంగా అసెంబ్లీ రికార్డుల్లో ఉండేలా మాట్లాడారు.

kcr 27062021 2

కట్ చేస్తే గత వారం రోజులుగా తెలంగాణా మంత్రులు, నాయకులు, జగన్ మోహన్ రెడ్డి పై నీళ్ళ విషయంలో విరుచుకు పడుతున్నారు. అక్రమ ప్రాజెక్ట్ లు కడుతున్నారని, విమర్శలు చేస్తున్నారు. ఇక్కడితో ఆగలేదు. జగన్ దొంగ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి రాక్షసుడు అన్నారు. అయినా వైసిపీ వైపు నుంచి కనీసం సౌండ్ లేదు. మొన్న లోకేష్ కుక్క అన్నాడని, పద మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసారు. ఇప్పుడు దొంగ అంటున్నా, రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడు అని అన్నా, సౌండ్ లేదు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలకు ఇదంతా డ్రామా అని అర్ధం అవుతుంది. గతంలో దుబ్బాక, హుజార్ నగర్ ఎన్నికలు అప్పుడు కూడా, టీఆర్ఎస్ ఇలాగే రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందింది. ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, మళ్ళీ అదే ఫార్ముల ఉపయోగించారు. అయితే ఇక్కడ జగన్ అండ్ కో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అక్కడ షర్మిల మా నాన్నను అంటే ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ జగన్ మాత్రం సైలెంట్. ఇక్కడే కేసీఆర్ జగన్ మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ అర్ధం అయిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read