జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న వేళ, ప్రధానిని కలిసి వివిధ అంశాల పై చర్చించే వేళ, కేంద్రం జగన్ కు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాల పై దేశ వ్యాప్తంగా రాద్ధాంతం జరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి, అటు ట్రిబ్యునల్, ఇటు హైకోర్ట్ అందరూ కలిసి జగన్ వైఖరిని ప్రశ్నిస్తున్నా, జగన్ మాత్రం మారటం లేదు సరి కదా, మరింత వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్ ఒప్పందాల సమీక్ష దగ్గర నుంచి, ఇప్పుడు ఏకంగా మీ దగ్గర కరెంటు తీసుకోము అనే స్థాయికి వ్యవహారం వెళ్ళింది. దీంతో ఇప్పుడు కేంద్రం ఎంటర్ అయ్యింది. ఈ సారి మాత్రం సుతి మెత్తగా కాకుండా, ఘాటుగానే బదులు ఇచ్చింది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పొతే, మాకేం పట్టింది అనే విధంగా, చాలా ఘాటుగా రాష్ట్రానికి రెండో లేఖ రాసింది.

current 06082019 2

సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇది కేంద్రం నుంచి వచ్చిన మూడో లేఖ. మేము చెప్పిన కారణాలు కాకుండా, మీ ఇష్టం వచ్చిన కారణాలు చూపించి, విండ్ , సోలార్ ఎనర్జీ విద్యుత్ తీసుకోకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జేబులో నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కంపనీలకు చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీన్తి సంబందించి కేంద్ర పునర్వినియోగ విద్యుత్‌ శాఖ అదనపు కార్యదర్శి డీపీ యాదవ్‌ ఈ లేఖ పంపారు. సోలార్, విండ్ నుంచి విద్యుత్తును తప్పనిసరిగా రాష్ట్రాలు తీసుకోవాలనే నిబంధన ఎప్పుడూ ఉందనే విషయం గుర్తు చేసారు. గ్రిడ్ దెబ్బ తింటుంది లేక ఇతర ఏదైనా అత్యవసర పరిస్తితుల్లోనే, ఆ విద్యుత్ తీసుకోవటం ఆపే హక్కు ఉంటుందని తెలిపారు.

current 06082019 3

అలాంటి అత్యవసర పరిస్థితిలో కూడా మీరు విద్యుత్ తీసుకోవద్దు అనుకున్నా, ముందుగా విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలకు ఆ కారణం లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆ లేఖలో పెరుకొన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్, విండ్ నున్వి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను కావాలని ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాయని, పరోక్షంగా ఏపిని ఉద్దేశించి ఆ లేఖలో రాసారు. రాష్ట్రాలు కనుక కావాలని అలా చేస్తే, ఆ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు అంతా, రాష్ట్రమే తమ జేబులో నుంచి ఇవ్వాలని, ఈ ఆదేశాలు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదంతోనే పంపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మోడీతో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకున్న ముందే, కేంద్రం నుంచి ఈ ఘాటు లేఖ రావటంతో, ప్రధాని మోడీని ఎలా కన్విన్స్ చెయ్యాలా అనే విషయం పై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read