విశాఖపట్నంలో జనసేన అధ్వర్యంలో, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ చేపట్టిన, లాంగ్‌మార్చ్‌ కార్యక్రమంలో, కలకలం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరుపున, మాజీ మంత్రులు, అయ్యన్నపాత్రురు, అచ్చెంనాయుడు పాల్గుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో, చిన్న కలకలం రేగింది. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో, బ్యారికేడ్లకు ఆనుకున్న ఉన్న వారికి కరెంటు షాక్ కొట్టింది. దీంతో అయ్యన్నపాత్రుడు వెంటనే తన ప్రసంగం ఆపేసి, అక్కడ నుంచి తప్పుకోవాలని కోరారు. వెంటనే జెనరెటర్ ఆపేయాలని కోరారు. దీంతో సభలో కరెంటు ఆగిపోయింది. వెంటనే అంబులెన్స్ ను పిలిచి, కరెంటు షాక్ కొట్టిన వారిని, హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు. ప్రాధమిక సమాచారం ప్రకారం, కరెంటు షాక్ సర్క్యూట్ కారణంగా, కరెంటు షాక్ తగిలింది అని, వెంటనే జెనరేటర్ ఆపేయటంతో, ప్రమాదమ తప్పింది.

vizag 03112019 2

ఇద్దురు నుంచి నలుగురికి, కరెంటు షాక్ కొట్టిందని, ప్రాధమికంగా తెలుస్తుంది. దాదపుగా 15 నిమిషాల పాటు, సభ ఆగిపోయింది. వెంటనే అక్కడ కరెంటు సరి చేసి, సభలో కరెంటు ఇచ్చారు. అయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా, సభ స్టేజ్ పై మాత్రమే కరెంటు ఇచ్చారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్వల్ప తొక్కిసలాట జరిగింది. తరువాత సభ సజావుగా సాగటం మొదలు పెట్టింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ కంటే, విశాఖ పిచ్చి ఆసుపత్రిలో ఉండే వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోపెట్టినా, బాగా పని చేస్తారని అన్నారు. ఇసుక కొరతతో, ప్రజలు అల్లాడిపోతుంటే, జగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతున్నారని అన్నారు.

vizag 03112019 3

విజయసాయి రెడ్డి లాంటి వారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు దత్త పుత్రుడు అంటున్నారని, 15 నెలలు జైలు జీవితం గడిపివచ్చిన వారు, ఇంతకంటే ఎలా మాట్లాడతారని అన్నారు. సమస్యను పరిష్కారం చెయ్యటమంటే, రాజకీయం చేస్తున్నారని అన్నారు. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల పడుతున్న ఇబ్బందులకు నిరసనగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని చేస్తుంది జనసేన. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడ నుంచి పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ, లోక్ సత్తా, బీజేపీ మద్దతు ప్రకటించాయి. అయితే బీజేపీ నేతలు ఎవరూ, ఈ సభలో మాత్రం పాల్గునలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read