40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పై ఒక టీవీ ఛానల్ తో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లడారు.. ఈ సందర్భంగా, మీరు ఇంత రాజకీయం చేసారు కదా, జగన్ లాంటి వాడు, మిమ్మల్ని కాల్చండి, కొట్టండి అంటూ, అమర్యాదగా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు, చంద్రబాబు స్పందించారు... జగన్ రాజకీయాలు లోలెవల్‌లో ఉంటాయన్నారు. తాను ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ నాయకులతో కలిసి పనిచేశానని అన్నారు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పౌరుషంగా మాట్లాడేవారని.. అయితే అందులో వినయం కనపడేదని అన్నారు...
కానీ, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన జగన్ మాట్లాడుతుంటే బాధ, ఆవేదన కలుగుతున్నాయని అన్నారు. ప్రజల కోసం అవన్నీ భరిస్తున్నా అన్నారు. ఎవరికైనా సంస్కారం చాలా ముఖ్యమని చెప్పారు. ప్రజల కోసం హుందాగా పని చేయాలన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ విపరీతంగా డబ్బులు సంపాదించారని... తప్పులు చేసిన వ్యక్తి లెక్కలేనితనంతో అప్పట్లో కాంగ్రెస్ ని ఎదిరించాడన్నారు. మళ్లీ సరెండర్ అయ్యి... బెయిల్ తెచ్చుకున్నాడన్నారు.
జైలుకెళ్లిన వ్యక్తి వచ్చి తిడుతుంటే ... ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు... తాను అవన్నీ పట్టించుకోనని... కానీ అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉంటానన్నారు... వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటే... అది ఎక్కడికో పోతుందని చెప్పారు... వారం వారం కోర్ట్ కి వెళ్లి వచ్చి, ఇతను ఇలా మాట్లాడుతుంటే, పేస్ చెయ్యాల్సి వస్తుంది అని, ప్రజల కోసం భరించాల్సి వస్తుంది అని చంద్రబాబు అన్నారు... జగన్ పదే పదే చేస్తున్న పిచ్చ వ్యాఖల పై చంద్రబాబు ఇలా స్పందించారు...