మధు కోడా.. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి... బొగ్గు కుంభకోణం కేసులో, మధుకోడా తో పాటు మరో ముగ్గురిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. మూడేళ్ల జైలు, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2007సంవత్సరంలో ఝార్ఖండ్‌లోని రాజ్‌హరా పట్టణంలో ఒక కంపెనీకి అక్రమంగా బొగ్గుగనులు కేటాయించినట్లు వీరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేటాయింపులో మధుకొడా, మరికొందరు ప్రభుత్వ అధికారులు ఆ కంపెనీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.

jagan 17122017 2

మన ప్రతి పక్ష నేత, నేనే సియం అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి చేసిన దారుణాలతో పోల్చుకుంటే, మాజీ సియం చేసిన అవినీతి, 1% కూడా లేదు... మరి, జగన్ పరిస్థితి ఏంటి ? ఒక పక్క సుప్రీం కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లు ఏర్పాటు చెయ్యమంటుంది... అంటే జగన్ కు ఇక లోపలకి వెళ్ళే టైం వచ్చిందా ? మాజీ సియంకి ౩ ఏళ్ళు జైలు... ఆ లెక్కన నేనే సియంకి, ఎన్ని ఏళ్ళు పడుతుంది ? లాలూ, జయ లాగా అన్నాళ్లు రిలీఫ్ ఉంటుందని ఆశల్లేవు. ఎందుకంటే వాళ్ల అవినీతి వందల కోట్లు. జగన్ కేసులో ఈడీ తేల్చిందే 43 వేల కోట్లు. అంటే గ్రావిటీ చాలా చాలా ఎక్కువ. దానికితోడు ఆధారాలున్నాయ్.

jagan 17122017 3

తొందర్లోనే జాతకాలు తేలిపోతాయ్. కేసుల వ్యవాహారాలు కొలిక్కివస్తాయ్. అదే జరిగితే ఇక జగన్ లోపలకి వెళ్లడం ఖాయం. ఇప్పటికే గుబులుగా ఉన్న నేతలంతా అప్పుడు ఏం చేస్తారు ? రేవులేని నావలా పార్టీ ఎటు కొట్టుకుపోతుంది ? నడిపేదెవరు ? ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న బొత్సా లాంటి నాయకులు పార్టీని ఎలా వాడతారు ? లాంటివన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలే.. అందుకే ఇపుడు జనంలో ఉండి సాధ్యమైనంత వరకూ తనకి తాను ధైర్యం చెప్పుకునే పనిలో ఉన్నారు జగన్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read